బిజినెస్

రూ.15.5 లక్షల కోట్లకు చేరిన ఎంఎఫ్ ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆదాయం, ఈక్విటీ విభాగాల్లో రాబడులు భారీగా పెరగడంతో ఆగస్టు నెల చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు 15.6 లక్షల కోట్లకు పెరిగాయి. చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే 42 కంపెనీలున్న ఈ పరిశ్రమ ఆస్తులు జూలై నెల చివరి నాటికి 15.2 లక్షల కోట్ల రూపాయల దాకా ఉన్నాయని, ఇది కూడా ఇంతకు ముందున్న గరిష్ఠమేనని భారత దేశంలో మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఎఎంఎఫ్‌ఐ) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆదాయాలు, ఈక్విటీ కేటగిరీల్లో భారీ పెరుగుదలే ఒక్క నెలలో ఇంత భారీగా మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు పెరగడానికి కారణమని నిపుణులు అంటున్నారు. అదేకాక పెరిగిన మదుపరుల నమ్మకం కూడా దీనికి కారణమని వారంటున్నారు. మొత్తంమీద జూలై నెల చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ. 1.03 కోట్లుకాగా, ఆగస్టు చివరి నాటికి అవి మరో రూ. 25,332 కోట్లు పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి.