బిజినెస్

పుంజుకుంటున్న ఉక్కు పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలో ఉక్కు పరిశ్రమలు బలమైన వృద్ధి రేటును సాధిస్తున్నాయని, మాంద్యం తర్వాత వీటి పురోగతి పుంజుకున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ఉక్కు ఎగుమతి దేశంగా గుర్తింపు పొందిందని అన్నారు. గత మూడేళ్ళలో ఉక్కు దిగుమతి 7.23 మిలియన్ టన్నుల నుంచి 7.83 టన్నులకు పెరిగిందని పేర్కొన్న ఆయన ‘దిగుమతులు పెరిగినప్పటికీ, దేశం నుంచి ఉక్కు ఎగుమతులు కూడా పెరిగాయని, అందుకు కారణం దేశీయ ఉత్పత్తి గణనీయంగా విస్తరించడమేనని తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో ముడి ఉక్కు సరఫరా 207.7 మిలియన్ టన్నులైతే డిమాండ్ 189 మిలియన్ టన్నుల మేర ఉందని తెలిపారు. దీనిని బట్టి చూస్తే దేశంలో ఉక్కు పరిశ్రమ విస్తరిస్తోందని, ఉక్కు ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నదన్నారు.