బిజినెస్

పరోక్ష పన్ను వసూళ్లు 27.5 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఎక్సైజ్ పన్నుల వసూళ్లు పెరగడంతో దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పరోక్ష పన్నుల నికర వసూళ్లు 27.5 శాతం పెరిగి 3.36 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, కస్టమ్స్ సుంకాలు సహా పరోక్ష పన్ను వసూళ్ల మొత్తంలో ఆగస్టు వరకు 43.2 శాతం వసూళ్లు జరిగినట్లు స్పష్టమవుతోంది. పరోక్ష పన్ను వసూళ్ల ద్వారా ప్రభుత్వం ఆగస్టు వరకు 3.36 లక్షల కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని రాబట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-ఆగస్టు మధ్య పరోక్ష పన్ను వసూళ్ల ద్వారా ప్రభుత్వం రాబట్టుకున్న నికర ఆదాయం కంటే ఇది 27.5 శాతం ఎక్కువ. సెంట్రల్ ఎక్సైజ్ పన్ను రూపంలో గత ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో రూ.1.03 లక్షల కోట్లు వసూలవగా, ఈ ఏడాది ఇదే కాలంలో ఆ మొత్తం రూ.1.53 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే గత సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ.75,219 కోట్లుగా ఉన్న సేవా పన్ను నికర వసూళ్లు ఈ ఏడాది 23.2 శాతం వృద్ధి చెంది రూ.92,696 కోట్లకు, కస్టమ్స్ సుంకం వసూళ్లు 5.7 శాతం వృద్ధి చెంది రూ.85,557 కోట్ల నుంచి రూ.90,448 కోట్లకు పెరిగాయి. పరోక్ష పన్నుల రూపంలో ఈ ఏడాది మొత్తం రూ.7.79 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల రూపంలో 8.47 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయాలని భావిస్తోంది.