బిజినెస్

‘ఉల్లి’ కోసం బారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, డిసెంబర్ 3: కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరడం తప్పడం లేదు. బహిరంగ మార్కెట్‌లో కేజీ ఉల్లిపాయల ధర రూ.100కు చేరువ కావటంతో రైతు బజారులో సబ్సిడీపై అందిస్తున్న ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది. కేజీ ఉల్లిపాయలు రూ.25లకు రైతు బజారులో విక్రయిస్తున్నారు. ఉల్లిపాయలు నాసిరకంగా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్ ధరకు దడిచి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకే వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. కేజీ ఉల్లిపాయల కోసం ఆధార్ కార్డు నకళ్లు పట్టుకుని గంటల తరబడి క్యూలైన్‌లలో వేచి చూడాల్సి వస్తోంది.