బిజినెస్

మరిన్ని సంస్కరణలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశాన్ని మరింతగా పెట్టుబడుల ఆకర్షక గమ్యస్ధానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం అవసరమైతే మరిన్ని సంస్కరణలను చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన ‘్భరత్-స్వీడన్ వాణిజ్య శిఖరాగ్ర సదస్సు’లో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ విదేశీ సంస్థలు విరివిగా భారత్‌లో పెట్టుబడులు మదుపుచేయాలని పిలుపునిచ్చారు. ఐతే తదుపరి ఎలాంటి సంస్కరణలు చేపడతారన్న విషయయం ఆమె స్పష్టం చేయలేదు. ‘దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే దిశగా వివిధ రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంద’న్నారు, ప్రధానంగా బ్యాంకింగ్, గనులు, బీమా వంటి పలు రంగాల్లో ఈ సంస్కరణలు చోటుచేసుకుంటాయన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటోందని భారతీయ కంపెనీలే కాకుండా ఇక్కడ నడుస్తున్న విదేశీ సంస్థలు సైతం ఇక్కట్లలో ఉన్నాయని నిర్మల తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తాను పరిశ్రమల వర్గాలతో వరుసగా సమావేశాలు నిర్వహించి సమస్యలను తెలుసుకుంటున్నానన్నారు. ఇటీవలి బడ్జెట్ సమావేశాల తర్వాత మళ్లీ వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఆ సమావేశాల కోసం వేచిచూసే పనిలేకుండా తాము కార్పొరేట్ పన్నుల కోత వంటి అనేక నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకుచ్చామని, దీన్నిబట్టి సంస్కరణలపై ప్రభుత్వ వైఖరి తేటతెల్లం అవుతుందని ఆమె అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు చేపడతామనడంలో సందేహం వద్దన్నారు. స్వీడన్‌కు చెందిన కంపెనీలు ఇక్కడి వౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు విరివిగా మదుపు చేయాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ రంగంలో రూ. 100 లక్షల కోట్లు పెట్టుబడిగా మదుపుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం ఓ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని, ఈనెల 15 నాటికి ముఖ్యమైన 10 వౌలిక వసతుల ప్రాజెక్టుల జాబితాను ఆ టాస్క్ఫోర్స్ ప్రభుత్వానికి అందజేస్తుందని వివరించారు. ఇందులోగ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు ఉంటాయన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-25 వరకు అమలయ్యే ‘నేషనల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ పైప్‌లైన్’ పథకం కింద ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ రూపొందుతుందన్నారు. కాగా భారత్ అతిపెద్ద మార్కెట్ సదుపాయంతోబాటు, అతిపెద్ద ఆశాదృక్పథ మధ్య తరగతి ప్రజల శాతాన్ని కలిగివుందని, వీరికి అత్యధిక కొనుగోలు శక్తి ఉందని నిర్మల సదస్సుకు హాజరైన స్వీడిష్ ప్రతినిధులకు తెలిపారు. ప్రధానంగా తమది ప్రజాస్వామ్య దేశమని అందువల్ల చట్టాలు కూడా పటిష్టంగా, పారదర్శకంగా అమలవుతున్నాయని, పెట్టుబడులకు ఇక్కడ మంచి భద్రత ఉంటుందని ఈసందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆమె పిలుపునిచ్చారు.
*చిత్రం...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్