బిజినెస్

ఉజ్వల్ స్మాల్ ఫెనాన్స్ బ్యాంకు ఐపీఓకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాథమిక బహిరంగ ఆఫరింగ్ (ఐపీఓ)కు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆఫర్ ముగింపు రోజైన బుధవారం జరిగిన బిడ్డింగ్‌లో ఈ ఇష్యూ 126.36 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ. 750 కోట్ల తాజా ఐపీఓకు మొత్తం 1,566 కోట్ల వాటాలకు బిడ్లు వచ్చాయి. జాతీయ స్టాక్ ఎక్చేంజి వద్ద లభించిన గణాంకాల మేరకు మొత్తం ఇష్యూ సైజు 12.39 కోట్ల వాటాలు. మంగళవారం రెండోరోజు ఈ ఐపీఓ 4.86 సార్లు సబ్‌స్కైబ్ అయింది. ఆఫర్‌లో ఒక్కో వాటా ధర రూ. 36 నుంచి 37 వరకు నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 303.75 కోట్ల పెట్టుబడులు సమీకరించిందని సంబంధింత అధికారులు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ‘మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్’తోబాటు దేశీయ సంస్థలైన సీఎక్స్ పార్ట్‌నర్స్ ఫండ్, అబేర్డీన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సుందరం మ్యూచువల్ ఫండ్, గోల్డ్‌మేన్ సచ్ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ యాంకర్ ఇనె్వస్టర్ బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.