బిజినెస్

నెల్లూరు జిల్లాలో రూ.2 వేల కోట్లతో స్టోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: గోల్డెన్ ఫోనెక్స్ కంపెనీ మరియు కింగ్‌బర్డ్‌ల ప్రతినిధులు సోమవారం జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని జలవనరులశాఖ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ కంపెనీ ప్రతినిధులు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో నెల్లూరు జిల్లాలో స్టోన్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ కంపెనీ నెల్లూరులో స్థాపిస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అధునాతన స్టోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుందని, ప్రపంచంలో చైనా తరువాత రెండవ స్థానంలో వుంటుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఆ కంపెనీ తరుపున వచ్చిన ప్రతినిధులకు మంత్రి వివిధ జిల్లాల్లో వున్న భూగర్భ జలాల మట్టాలను సిఎం డ్యాష్ బోర్డు ద్వారా వివరించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో భూగర్భ జలమట్టం 7.07 మీటర్లు, అదే విధంగా కృష్ణాజిల్లాలో భూగర్భ జలమట్టం 8.76 మీటర్లలో అందుబాటులో వున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఫింగర్ టిప్స్ మీద టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి ఈ డ్యాష్ బోర్డు ఉపయోగపడుతుందని చైనా నుంచి వచ్చిన ప్రతినిధులకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉబామహేశ్వరరావు చెప్పారు. న్యూఢిల్లీకు చెందిన సుభాష్ గులాటి ఆధ్వర్యంలో చైనాకు చెందిన గోల్డెన్ ఫోనెక్స్ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ వాట్ డెంగ్యూ తదితరులు మంత్రిని కలిసినవారిలో వున్నారు.

చిత్రం.. గోల్డెన్ ఫోనెక్స్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి ఉమ