బిజినెస్

వ్యక్తిగత డేటా రక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే భారీగా పెనాల్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కొత్తగా అమలు కానున్న ‘వ్యక్తిగత డేటా రక్షణ చట్టం’ మేరకు నిబంధనలను అతిక్రమించిన కంపెనీలు పెనాల్టీగా రూ. 15 కోట్లు లేదా అంతర్జాతీయ టర్నోవర్‌లో 4 శాతం చెల్లించాల్సివుంటుంది. ఈ చట్టానికి సంబంధించిన ప్రతిపాదనలకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా తాజా చట్టానికి సంబంధించిన బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరుగుతుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఈ చట్టానికి సంబంధిన భారీ అతిక్రమణలపై పెనాల్టీలు పైన పేర్కొన్న విధంగా ఉంటాయని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం కీలకమైన వ్యక్తిగత డేటా స్టోరేజీ దేశీయంగానే జరుగుతుంది. అలాగే సున్నితమైన వ్యక్తిగత డేటాను దేశం వెలుపల సంబంధిత వ్యక్తుల అంగీకారం మేరకు ప్రాసెస్ చేయడం జరుగుతుందని ఆ అధికార వర్గాలు తెలిపాయి. సార్వభౌమత్వం, జాతీయ భద్రత, కోర్టు ఆదేశాలు వంటి అంశాలు తలెత్తినపుడు డేటా ప్రైవసీ చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండానే డేటా ప్రాసెసింగ్ చేసేలా వెసుబాటు కల్పించడం జరిగింది.