బిజినెస్

ఎస్బీఐలో పెరుగుతున్న మొండి బకాయిలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చాలా బ్యాం కుల మాదిరిగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనూ మొండి బకాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద రుణదాత బ్యాంకైన ఎస్బీఐలో నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) విలువ 11,932 కోట్లు పెరిగింది. మొత్తం మీద బ్యాంకు ఎన్పీఏ మొత్తం 1,72,750 కోట్ల రూపాయలుకాగా, పెరిగిన మొత్తాలను కూడా చేరిస్తే 1,84,682 కోట్ల రూపాయలకు చేరుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎన్పీఏ 65,895 కోట్ల రూపాయలుకాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 77,827 కోట్ల రూపాయలకు పెరిగింది. రాని బాకీలు లేదా మొండి బకాయిలను నిరర్ధక ఆస్తులుగా బ్యాలెన్స్ షీట్‌లో చూపించడం ఆనవాయితీ. లేకపోతే, బ్యాంకు నష్టాలు భారీగా కనిపిస్తాయి. అందుకే, ఇలాంటి మొత్తాలను రావాల్సిన బకాయిలుగా పేర్కొంటూ, ఆస్తుల రూపంలో చూపి, క్రమంగా కొంత మొత్తం చొప్పున నష్టాల పద్దులో చూపుతారు. అందుకే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్పీఏను 12,036 కోట్ల రూపాయలుగా చూపాలని నిర్ణయించినట్టు సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో ఎస్బీఐ స్పష్టం చేసింది. రాని బాకీల మొత్తాలు పెరుగుతున్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 862 కోట్ల రూపాయల లాభాన్ని ప్రకటించింది. గత మూడో త్రైమాసికంలో 3,143 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ పద్దుకింద కేటాయించగా, తాజాగా 4,654 కోట్ల రూపాయలుగా ఖాయం చేసింది. ఇటీవల కాలంలో రుణ ఎగవేతదారుల సంఖ్య పెరగడం ఎస్బీఐని ఆందోళనకు గురి చేస్తున్నది. బ్యాంకుల నుంచి వందలు, వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకొని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. పలు నిబంధనలను కఠినతరం చేసింది. కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల సాయంతో ఎగవేతదారులపై చర్యలకు పూనుకుంటున్నది. అయితే, ఎవరు, ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, రుణాలను తీసుకొని, ఎగవేయడం సాధారణమైంది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులే ఎక్కువగా రుణాలనిచ్చి, భారీగా మోసపోవడం గమనార్హం. ఎస్బీఐలో ఎన్పీఏ మొత్తాలు గణనీయంగా పెరగడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.