బిజినెస్

విశాఖ-చెన్నై కారిడార్‌పై సర్కారు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 18: విపక్షాలు చేపడుతున్న ఆందోళనలను ఎంతమాత్రం ఖాతరు చేయకుండా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలను స్వాగతించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా చేసిన ప్రకటనతో ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి రెడ్ కార్పెట్ పరచినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఏ ఒక్క పెట్టుబడిదారుడికీ ఇబ్బంది లేకుండా, అన్నిరకాల సౌకర్యాలను కల్పించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో తగిన బందోబస్తుతో రక్షణ కల్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగావుంది. ఇటీవల విశాఖ-తూర్పు గోదావరి జిల్లాల మధ్య పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. విశాఖ-చెన్నై మధ్య ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో విశాఖ-కాకినాడ మధ్య పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు నగరాల మధ్య ఇటీవల సర్వే జరిగింది. విశాఖ-కాకినాడ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేయడానికి అవసరమైన ప్రణాళికలను కూడా ప్రభుత్వం సిద్ధంచేసింది.
మరోవైపు పరిశ్రమల ఏర్పాటుపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అధికారంలోకివస్తే తమకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే తమ గోడును పట్టించుకోవడం లేదని తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఎస్‌ఇజడ్‌ను రద్దుచేసి ఎవరి భూములను వారికి తిరిగిచ్చే బాధ్యత తీసుకుంటానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని ఇప్పుడు బాధితులు గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలైనా సెజ్ బాధితుల గురించి పట్టించుకున్న దాఖలాల్లేకపోగా, కొత్తగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటుచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు కాకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ మెడికల్ లేబొరేటరీస్‌కు వ్యతిరేకంగా బాధితులు సాగిస్తున్న ఆందోళనను చంద్రబాబు ప్రస్తావించారు. కాగా రానున్న రెండేళ్లలో తూర్పు గోదావరి జిల్లాలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సుమారు 2వేల కోట్లతో వివిధ పరిశ్రమలను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు ఇటీవల జారీ అయ్యాయి. ఈ భారీ పరిశ్రమలకు అనుబంధంగా పలు మధ్య, చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటుకానున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగానే కాకినాడ-విశాఖ మధ్య తీర ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు బహుళ జాతి సంస్థలు ముందుకువస్తున్నాయి. పెట్రో, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. జిఎంఆర్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలిలో పరిశ్రమలను ఏర్పాటుచేస్తున్నారు.