బిజినెస్

భారత కంపెనీల విదేశీ పెట్టుబడులు 84 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: ఆగస్టు నెలలో భారతీయ సంస్థల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 84 శాతం తగ్గి 399.06 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో భారతీయ కంపెనీలు విదేశీ మార్కెట్లలో 24.7 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ ఏడాది జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో ప్రత్యక్ష పెట్టుబడులు 82.6 శాతం తగ్గాయి. గ్యారంటీల జారీ, రుణాలు, ఈక్విటీల రూపంలో ఈ పెట్టుబడి ఉన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన వాటిలో పలవ డ్వెల్లర్స్ ఒకటి. ఈ సంస్థ జెర్సీ, మారిషస్, నెదర్లాండ్స్‌లలోని తన అనుబంధ సంస్థల్లో 21.75 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. డబ్ల్యు ఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ బ్రిటన్‌లోని ఒక జాయింట్‌వెంచర్‌లో 15.75 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దక్షిణాఫ్రికాలోని తన వ్యాపార సంస్థలో 11.9 మిలియన్ డాలర్లు పెట్టగా, భారత్ పెట్రోరిసోర్సెస్ నెదర్లాండ్స్‌లోని తమకు చెందిన ఒక యూనిట్‌లో 15.15 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ నెదర్లాండ్స్‌లోని జాయింట్‌వెంచర్‌లో 19.39 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.