బిజినెస్

జీవన్ ప్రమాణ్ పత్రం ఏడాదిలో ఎప్పుడైనా ఇవ్వొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఈపీఎఫ్ పెన్షన్‌దారులు ఇకమీదట ప్రతి ఏడాది నవంబర్‌లో ‘జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్ట్ఫికేట్)’ తమకు అందజేయాల్సిన అవసరం లేదని, ఏడాదిలో ఎప్పుడైనా ఇస్తే సరిపోతుందని ప్రావిడెంట్ ఫండ్ అసిస్టెంట్ కమిషనర్ (సీటీ) డీ. శ్రీకాంత్ తెలిపారు. పదవీ విరమణ చేసి ‘ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్)’ 1995 కింద పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు విధిగా ప్రతి ఏడాది నవంబర్‌లో జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్ట్ఫికేట్) ఇవ్వాలన్న నిబంధన స్థానే ఈ కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నామని ఆయన తెలిపారు. నవంబర్‌లోనే జీవన్ ప్రమాణ్ సర్ట్ఫికేట్ ఇవ్వాల్సి రావడం వల్ల పెన్షనర్లు కార్యాలయానికి చేరుకోవడం, రద్దీగా ఉండడం, భారీ క్యూలైన్లు ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇకమీదట జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్ట్ఫికేట్) పత్రాన్ని నవంబర్‌లోనే కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి ఇచ్చే సౌకర్యాన్ని కల్పించినట్లు ప్రావిడెంట్ ఫండ్ అసిస్టెంట్ కమిషనర్ (సీటీ) శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 040-27564571 లేదా ఈ-మెయిల్: ఆర్‌వో.హెచ్‌వైడీఎట్‌దిరేట్‌ఆఫ్‌ఈపీఎఫ్‌ఐఎన్‌డీఐఎ.జీవోవీ.ఇన్ ద్వారా సంప్రదించవచ్చని ఆయన వివిరించారు.