బిజినెస్

రెండో రోజూ ఉత్సాహం.. స్వల్పంగా పెరిగిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ టీసీఎస్ కంపెనీల ఊతంతో వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. సెనె్సక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో బలపడ్డాయి. నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 92.94 పాయింట్లు పెరిగి 41,952.63పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 32.75పాయింట్లు పెరిగి 12.362.30 వద్ద ముగిసింది. వినియోగ ధరల సూచీ సానుకూలంగా ఉండడం, బడ్జెట్‌పై కూడా ఆశాజనక వాతావరణం నెలకొనడంతో మార్కెట్ కూడా పుంజుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. కాగా నేటి లావాదేవీల్లో పుంజుకున్న కంపెనీల్లో హీరో మోటో కార్ప్ షేర్ల విలువ 2.5శాతం మేర పెరిగింది. అలాగే ఐటీసీ షేర్లు 1.74, ఎన్‌టీపీసీ షేర్లు 1.48, టెక్ మహేంద్ర షేర్లు 1.42, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.38 శాతం మేర పెరిగాయి. అయితే ఇండోసిండ్ షేర్లు అత్యధికంగా నష్ట పోయాయి. అలాగే రిల్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3.85 శాతం మేరకు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, ఇంధనారంగం, హెల్త్‌కేర్ కంపెనీలకు సంబంధించిన షేర్లు స్వల్పంగా పెరిగాయి. మారుతున్న వాతావరణంలో నిఫ్టీ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, భారతీయ ఈక్విటీ మార్కెట్ అనుకున్న స్థాయిలో బలాన్ని పుంజుకోవడం లేదని నిపుణలు చెబుతున్నారు. ఆర్థిక మాంధ్య పరిస్థితుల కారణంగానే గత కొన్ని నెలలుగా భారతీయ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో పనితీరును కనబర్చడంలేదన్న వాదన వినిపిస్తోంది. కాగా, ఆసియా మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలతోనే ముగిసాయి.