బిజినెస్

బంగారు ఆభరణాలకు కొత్త హాల్ మార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు విక్రయాలకు సంబంధించి సరికొత్త హాల్‌మార్క్ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం 2001 జనవరి 15 నుంచి అమలులోకి తేబోతోంది. 14, 18, 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆభరణాలు, వస్తువులను మాత్రమే బంగారం వర్తకులు 15వ తేదీ నుంచి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రమాణాలను ఉల్లంఘించిన వర్తకులపై భారీ జరిమానా, ఏడాది జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ‘స్వచ్ఛమైన బంగారం వినియోగం ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని హాల్‌మార్కింగ్ నిబంధనలను నిర్భంధంగా అమలు చేయాలని వర్తకులకు స్పష్టం చేశాము. భారతీయ ప్రమాణాల బ్యూరో వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు ఏడాది పాటు గడువు ఇచ్చాము’ అని తెలిపారు. వినియోగదారులు కూడా ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు ఈ 4 హాల్‌మార్క్‌లను పరిశీలించాలని ఆయన తెలిపారు. డీఐఎస్ మార్క్, క్యారెట్ల నాణ్యత, వర్తకులు గుర్తింపు మార్కులను దృష్టిలో పెట్టుకోవాలని పాశ్వాన్ తెలిపారు. కొత్త హాల్‌మార్కింగ్ ప్రమాణాలపై గురువారం కేంద్ర వినియోగ దారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తోందని పాశ్వాన్ తెలిపారు. ఆభరణాలపై హాల్‌మార్కింగ్ అన్నది వాటి తయారీకి వినియోగించిన పసిడి నాణ్యతను సూచిస్తోంది. ఇప్పటి వరకు స్వచ్చందగానే సదరు వర్తకులు ఈ బంగారం నాణ్యతను ప్రకటించేవారు. ఇక నుంచి 14-18-22 క్యారెట్ల బంగారాన్ని వినిగోంచిల్సా ఉంటుంది. భారతీయ ప్రమాణాల బ్యూరో బంగారం ఆభరణాలకు సంబంధించి ఇప్పటికే హాల్ మార్కింగ్ పథకాన్ని అలులు చేస్తోందం, ప్రస్తుతం 40 శాతం ఆభరణాలపై హాల్ మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది. ‘2021 జవరని 11 1 నుంచి కూత్త క్యారెట్ ప్రమణాలను నిర్భంధంగా అదలు చేయయాలి. ఇందుకోసం వర్తకులకు ఏడాదిపాటు గడువు ఇస్తున్నాం’ అని పాశ్వాన్ తెలిపారు . దేశంలో అన్ని జిల్లాల్లోనూ బంగారం హాల్‌మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాది వ్యవధిలోనే వర్తకులు అందరూ రిజిస్టర్ అయ్యేలా చూస్తామని పాశ్వాన్ తెలిపారు. ఇందులో భాగంగా కొత్త ప్రమాణాలను ప్రచారంలో తెచ్చేందుకు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు. ఆభరణాల తయారీలో తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని వినియోగించకుండా, అలాగే వినియోగ దారులు బంగారం నాణ్యత విశయంలో మోస పోకుండా ఈ కొత్త విధానం నిరోధిస్తుందని పాశ్వార్ వివరించారు. భారతీ ప్రమణాల బ్యారోకు చెందిన సీనియర్ అధికారి హెచ్‌ఎస్ పస్రీచే మాట్లాడుతూ హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అమ్మిన ఆభరణ విలువపై లక్ష నుంచి ఐదు రెట్టుల జరిమానా విధిస్తామని, అలాగే ఏడాది పాటు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉణటుందని తెలిపారు.