బిజినెస్

కేంద్ర బడ్జెట్ అంచనాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల తాజాత్రైమాసిక ఫలితాలు, వచ్చే కేంద్ర బడ్జెట్‌లోప్రయోజనాలపై అంచనాలు ఈవారం స్టాక్ మార్కెట్ల తీరును ప్రభావితం చేస్తాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫలితాలు ఈ వారం కీలకం కానున్నాయి. గత వారం బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 345.65 పాయింట్లు (0.83 శాతం) లాభపడింది. ఇందుకు అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారడంతోబాటు అమెరికా-చైనా మధ్య 18 నెలల సుదీర్ఘ చర్చల్లో ఓ ప్రాథమిక వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు అవకాశాలు ఏర్పడడం వంటి అంతర్జాతీయ సానుకూలతలు ప్రధానంగా దోహదం చేశాయి. కాగా ప్రస్తుతం అంతర్జాతీయ స్థితిగతులతోబాటు రాబోయే కేంద్ర బడ్జెట్ ముందస్తు అంచనాలు మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ప్రముఖ విశే్లషకుడు సిద్ధార్థఖెమ్కా అభిప్రాయపడ్డారు. ఇటీవల సాగుతున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల విడుదల కొనసాగింపుగా ఈ వారం వెలువడే ఫలితాల తీరును సైతం ఇనె్వస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణ, ఎరువులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వౌలిక, నిర్మాణ రంగాల ఫలితాల తీరు మార్కెట్లను ప్రభావితం చేస్తుందంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యు ఉక్కు, జీ, హేవెల్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ పలితాలు కీలకం కానున్నాయి. అలాగే అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తీరు సైతం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో వాణిజ్య వర్గాలు అనేక ప్రయోజనాలను ఆశిస్తున్నాయని మరో ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు.
ప్రధానంగా అందరి కళ్లూ టీసీఎస్ వాటాల స్థితిగతులపై కేంద్రీకృతం అయ్యాయన్నారు. గడచిన వాణిజ్య వారం చివరి రోజు మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఈ ఐటీ దిగ్గజం మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అందులో నికర లాభాల్లో 0.2 శాతం తగ్గుదలతో రూ. 8,118 కోట్లుగా చూపింది. ఇక అదేరోజు ఫలితాలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాల్లో 13.5 శాతం వృద్ధితో రూ. 11,640 కోట్లు సమకూరినట్టు తెలిపింది.