బిజినెస్

సెనె్సక్స్ 416 పాయింట్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: గత రెండురోజులుగా కొత్త రికార్డును నమోదు చేసుకుంటూ పెరుగుతూ వచ్చిన సెనె్సక్స్ సోమవారం ఒక్కసారిగా 416 పాయింట్లు పడిపోయింది. రిలయన్స్, కోటక్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో వీటి షేర్ల అమ్మకాలు విపరీతంగా సాగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోటక్ బ్యాంక్ షేరు విలువ ఏకంగా ఐదు శాతానికి పడిపోయింది. నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 416.46 పాయింట్లు కోల్పోయి 41,528.91 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 127.80 పాయింట్లు కోల్పోయి 12,224.55 వద్ద ముగిసింది. సెనె్సక్స్ షేర్లలో అత్యధికంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 4.70 శాతం మేర నష్టపోయాయి. మూడో త్రైమాసికంలో నిరర్థక ఆస్తులు పెరిగాయన్న ఈ బ్యాంకు నివేదిక ఇందుకు కారణమైంది. అలాగే, త్రైమాసిక ఫలితాల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ షేర్లపై పడింది. వీటి షేర్లు దాదాపుగా 3.08 శాతం మేర నష్టపోయాయి. కాగా, నేటి లావాదేవీల్లో అత్యధిక స్థాయిలో 3.75 శాతం మేర పవర్‌గ్రిడ్ కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. ఆ తర్వాత వరసలో నిలిచిన భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. కొన్ని రకాల కంపెనీల షేర్లపై మదుపరులు లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితి స్వల్ప కాలంపాటు కొనసాగవచ్చునని చెబుతున్నారు. అయితే, రానున్న బడ్జెట్‌కు సంబంధించి వాస్తవిక లెక్కలు ఎలా ఉంటాయన్న దానిపైనే మార్కెట్ తీరు ఆధారపడి ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కాగా, షాంఘై టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారక విలువ మూడు పైసలు తగ్గి 71.11కు చేరుకుంది. మధ్య ప్రాశ్చ, ఉత్తర అమెరికాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరిగిన ప్రభావం భారత మార్కెట్‌పై పడింది.