జాతీయ వార్తలు

మిత్ర దేశాలతో వాణిజ్యం మరింత సరళతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు/ న్యూఢిల్లీ, జనవరి 21: భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన రూ. 140 కోట్లతో నిర్మించిన జోగ్‌బని-బీరట్‌నగర్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ (ఐసీపీ)ను ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి మంగళవారం సంయుక్తంగా ప్రారంభించారు. భారతదేశ ఆర్థిక సహాయంతో 260 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చెక్‌పోస్ట్ రోజుకు 500 ట్రక్కులను తనిఖీ చేసి పంపించగలుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సంయుక్తంగా వీడియో లింక్ ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. భారత్, నేపాల్ మధ్య ఇది రెండో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్. తొలి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను 2018లో రాక్సౌల్-బీర్‌గుంజ్‌లో నిర్మించారు. మంగళవారం రెండో ఐసీపీని ప్రారంభించిన అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ తన ఇరుగుపొరుగున గల అన్ని మిత్ర దేశాలతో వాణిజ్యాన్ని, సరుకు రవాణా వాహనాల రాకపోకలను సరళతరం చేయడానికి, సాఫీగా కొనసాగించడానికి, వ్యాపారం, సంస్కృతి, విద్య వంటి రంగాలలో తమ మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు కట్టుబడి ఉందని అన్నారు. భారత్, నేపాల్ రోడ్డు, రైలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు వంటి అనేక సీమాంతర అనుసంధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ‘మా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ముఖ్యమయిన ప్రదేశాలలో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లు పరస్పర వ్యాపారాన్ని, ఇరు దేశాల మధ్య రాకపోకలను బాగా పెంచుతున్నాయి’ అని మోదీ అన్నారు. నేపాల్‌లో 2015లో సంభవించిన భూకంపం తరువాత భారత్ ఆర్థిక సహాయంతో చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ సందర్భంగా ఇరువురు ప్రధానమంత్రులు తెలుసుకున్నారు. నేపాల్‌లో పర్యటించవలసిందిగా కేపీ ఓలి ఈ సందర్భంగా మోదీని ఆహ్వానించారు. ఈ సంవత్సరమే నేపాల్‌లో పర్యటిస్తానని మోదీ బదులిచ్చారు.