బిజినెస్

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: పెట్టుబడులకు ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉండగా, ఇండి యా వరకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యంతమైన ప్రాంతం హైదరాబాద్ నగరమని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తార క రామారావు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ మంగళవారం వివిధ దేశాల నుంచి హాజరైన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సీఎన్‌బీసీ టీవీ-18, సీఐఐ సంయుక్త అధ్వర్యంలో‘ది ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్’ అంశం పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్‌లో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని, 20 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న యువత ఇండియాకు అద్భుతమైన బలమన్నారు. తమ దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. తమ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టాప్-5 ఐటీ దిగ్గజాలు తమ కేంద్ర కార్యాలయాల తర్వాత హైదరాబాద్‌ను అతి పెద్ద కార్యస్థానంగా ఎంచుకున్నట్టు కేటీఆర్ వివరించారు. ప్రపంచంలోనే నివాసానికి హైదరాబాద్ నగరం అత్యుత్తమంగా మెర్సర్ ఐదు సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిందన్నారు. దీంతో పాటు ఇటీవల ప్రపంచంలోని 130 నగరాలలో అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్‌ను జీఎల్‌ఎల్ సంస్థ గుర్తించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ హైదరాబాద్‌లో తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు వౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇండియాతో పాటు రాష్ట్రాలు కూడా మరింత బలోపేతం కావాలంటే ఇన్నోవేషన్, ఇన్‌క్లూజివ్ గ్రోత్, ఇన్‌ఫ్రాస్ట్రకర్చర్ మూడింటిని పాటించాలన్నారు. ప్యానల్ డిస్కషన్ అనంతరం దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కలిశారు. వీరిలో రోషే కంపెనీ చైర్మన్ క్రిష్ట్ఫోర్ ప్రాన్జ్, హెచ్‌పీ సీఈవో విశాల్ లాల్, అపోలో టైర్స్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ కన్వర్, కాల్ల్స్ బెర్గ్ గ్రూప్ చైర్మన్ పెమ్లింగ్ బెసెన్ బాచర్, పీ అండ్ జీ దక్షిణాసియా సీఈవో మాగెశ్వరన్ సురంజన్ తదితరులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరం ఫార్మా హబ్‌గా మారిందని, ఫార్మాసిటీ, మెడికల్ డివైస్ పార్క్‌లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, లైఫ్ సైనె్సస్ రంగాలలో పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు.
'చిత్రం...దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులను కలిసిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్