బిజినెస్

అదానీ ప్రాజెక్టులో ఐఓసి, గెయిల్‌కు వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూపు ఒడిశాలో 5 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ధమ్రా ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ప్రాజెక్టులో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి)తో పాటు గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) బుధవారం ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఏడాదికి 50 లక్షల టన్నుల సామర్ధ్యంతో ధమ్రాలో 2018-19 నాటికి ఏర్పాటు చేయతలపెట్టిన ఎల్‌ఎన్‌జి ఇంపోర్ట్ టెర్మినల్‌లో ఐఓసి 38 శాతం వాటాను, గెయిల్ 11 శాతం వాటాను కొనుగోలు చేయనుండగా, ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న అదానీ పెట్రోలియం టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ 49 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 2 శాతం వాటాను ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై బుధవారం సంతకాలు జరుగుతాయని, ఒడిశాకే చెందిన కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.