బిజినెస్

దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి ఆదాయం రూ. 46 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: దక్షిణ మధ్య రైల్వేకి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కాసుల వర్షం కురిసింది. ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే దాదాపు కోటి మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేసింది. ప్రయాణికుల చేరవేతతో రైల్వేకి రూ.46 కోట్లు ఆదాయం వచ్చింది. ఈనెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 456 రైళ్లను నడిపింది. సాధారణ ప్రయాణికుల కోసం 65 జనసాధారణ్ రైళ్లను నడిపారు. రెగ్యులర్ రైళ్లతో పాటు 255 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నిజామాబాద్, కర్నూల్, నాందేడ్, ఔరంగాబాద్, ఖమ్మం, తిరుపతి, నర్సాపూర్, మచిలీపట్నం బెంగళూరు నగరాల మధ్య రైళ్లను నడిపారు. సంక్రాంతి సందర్భంగా గత సంవత్సం కంటే ఈ ఏడాది 2.4 లక్షల మంది ప్రయాణికులు అధికంగా గమ్యస్థానాలకు చేరారు. సాధారణ సమయాలలో కన్నా 6 లక్షలు మంది అధికంగా ప్రయాణించారు. దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు రిజర్వు చేసుకున్నారు. సంక్రాంతికి 120 రోజుల ముందే రైల్వే రిజర్వేషన్‌ను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. 120 రోజుల ముందు రిజర్వు చేసుకున్న ప్రయాణికుల చార్జీల సొమ్మును పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం సంక్రాంతి సందర్భంగా రిజర్వులేని ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీల సొమ్ము వివరాలు మాత్రమే విడుదల చేసినట్లు రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. గుంటూరుకులో జరగనున్న బైబిల్ కనె్వన్సన్ వార్షిక ఉత్సవాల కోసం సికింద్రాబాద్, కాకినాడ మధ్య రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు 27, 29 తేదీలో ఆయా స్టేషన్ల మధ్య నడుస్తాయి. ఈ ఉత్సవాల కోసం గుంటూరులోని నాగార్జుననగర్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేకంగా రైళ్లను నిలుపుతారు. సికింద్రాబాద్ - గుంటూరు ( 17201- 17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు, విశాఖపట్నం - గుంటూరు (17239- 17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి.

సికింద్రాబాద్‌లో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు (ఫైల్ ఫొటో)