బిజినెస్

2025 నాటికి ప్రపంచ నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్ వన్ సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు అదానీ గ్రూప్ సంస్థల అధినేత బిలియనీర్ గౌతం అదానీ బుధవారం నాడిక్కడ తెలిపారు. 2025 నాటికి తమ సంస్థను అం తర్జాతీయ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పాదక ఆగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని, అలాగే 2030 నాటికి అతిపెద్ద సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు వాణిజ్య వర్గాల ప్రత్యేక సామాజిక వేదిక ‘లింకెడిన్’లో గౌతం అదానీ ఓ పోస్టు పెట్టారు. ప్రపంచ స్థాయిలో సౌర విద్యుత్ వినియోగ ప్రాధాన్యత పెరుగుతోందని, అందుకనుగుణంగా ఎదిగేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 2019 సంవత్సరానికి అదానీ గ్రూప్ సంస్థ అంతర్జాతీయంగా సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో 6వ ర్యాంకును కైవసం చేసుకుంది. 2020లో దేశంలోకెల్లా అతిపెద్ద సౌర విద్యుత్ సంస్థగా ఆవిర్భవించాలన్న తమ లక్ష్యానికి ఈ తాజా ర్యాంకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని అదానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం 2.5 గిగావాట్ల సౌర విద్యుత్‌ను తమ సంస్థ ఉత్పత్తి చేస్తోందని ఈ ఏడాది అంతానికి 2.9 గిగావాట్ల ఉత్పతికి చేరుకుంటామని, 2015 నాటికి 18 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని, తమ సంస్థల మొత్తం బడ్జెట్‌లో 70 శాతం ఈ స్వచ్ఛ విద్యుత్‌పై, ఇంధన సామర్థ్యం పెంపుపై వెచ్చించాలని నిర్ణయించామని అదానీ వివరించారు.

'చిత్రం... అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతం అదానీ