బిజినెస్

సింగరేణి పరిధిలోకి ఒడిశా నైనీ బొగ్గు గనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ప్రపంచ ఖ్యాతిని సంపాధించిన సింగరేణి సంస్థ మరో ముందడుగు వేసింది. సింగరేణితో పాటు ఒడిస్సాలో ఉన్న నైనీ, న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణాకు శ్రీకారం చుట్టనున్నది. ఒడిస్సా బొగ్గు గనులకు సంబంధించిన అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. దీంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి,రవాణాకు అవసరమైన వౌలిక వసతులు అందుబాటులో ఉండేలా సింగరేణి అధికారులు ఈనెల 22,23 తేదీల్లో పర్యటించారు. ఇప్పటికే దేశంలో ఉన్న ప్రముఖ బొగ్గు గనుల కంపెనీలకు ధీటుగా సింగరేణి తన ప్రతిభను నిరూపించుకుంది. ఒడిస్సా రాష్ట్రంలోని నైనీ, న్యూ పాత్రపాద బొగ్గు గనుల్లో 1500 మిలయన్ల బొగ్గు ఉన్నట్లు అధికారింగా సింగరేణి గుర్తించింది. దీంతో సింగరేణికి సమాంతరంగా నైనీని బ్లాకు నుంచి బొగ్గు ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్రం అనుమతులు లభించడంతో నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పనులను చేపట్టడానికి సింగరేణి అధికారులు అక్కడ పర్యటించారు. సింగరేణికి చెందిన డైరెక్టర్లు భాస్కర్‌రావు( ప్రాజెక్టు, ఫ్లానింగ్) బలరాం (ఫైనాన్స్) ఆధ్వర్యంలో ఆర్థిక, ఐటీ, పర్యావరణ, ఎస్టేట్ విభాగాలకు చెందిన అధికారుల బృందం సభ్యులు ఉన్నారు. ఈ బృందం తొలుత భువనేశ్వర్‌లో పరిధిలో చేపడుతున్న వివిధ పరిశ్రమల్లో పర్యావరణహిత, చర్యలపై జరిగిన రాజ్యసభ కమిటీ సమావేశంలో పర్యటన బృందం పాల్గొంది. సింగరేణి అధికారుల బృందంతో పాటు కోల్ ఇండియా తదితర సంస్థలు బొగ్గు తవ్వకం సమయంలో తీసుకోనున్న పర్యావరణహిత మైనింగ్, బొగ్గు రవాణా అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నైనీ బొగ్గు బ్లాకులో అంగూల్ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అధికారుల బృందం సందర్శించింది. బొగ్గు తవ్వకాలకు సంబంధించిన సర్వే, డ్రిల్లింగ్ పూర్తి చేశారు. ఇక బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సన్నాహాలను వేగవంతం చేస్తున్నారు. బొగ్గు బ్లాకుల్లో వౌలిక వసతులు పూర్తి అనంతరం అక్కడ బొగ్గు ఉత్పత్తిని వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని బృందం అభిప్రాయపడింది. ప్రతి ఏడాది కనీసం 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. నైనీ బొగ్గు బ్లాకు సింగరేణికి గొప్ప వరంలాంటిదని అధికారులు చెబుతున్నారు. నైనీ బొగ్గు బ్లాకు ఏరియాలోని గ్రామాల్లో సామాజిక బాధ్యతగా వౌలిక సదుపాయాల కల్పనకు సింగరేణి కృషి చేస్తుందని అధికారుల బృందం స్పష్టం చేసింది. నైనీ బ్లాకు సింగరేణి బంగారు భవిష్యత్‌కు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. సింగరేణి అధికారుల బృందం వెంట నైనీ బ్లాకు జనరల్ మేనేజర్ సీహెచ్ విజయరావు,జీఎం ఫైనాన్స్, అకౌంట్స్ నర్సింహారెడ్డి,జీఎం ఆడిట్ సుబ్బారావు, చీఫ్ ఐటీ రాంకుమార్, ఎంజీఎం ఎన్విరాన్ మెంట్ రవికుమార్, ప్రాజెక్టు ఆఫీసర్ ఆర్‌పీ ఛౌధరి, పూర్ణచంద్రరావు, గణేష్, బ్రజెష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

'చిత్రం...ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులను సందర్శిస్తున్న సింగరేణి అధికారులు