బిజినెస్

వాహన ఎల్‌పీజీపై జీఎస్టీని తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: వాహన ఎల్‌పీజీపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని ‘అఖిల భారత ఆటోఎల్‌పీజీ సంఘాల సంకీర్ణం’ (ఐఏసీ) ఆదివారం నాడిక్కడ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే వాహనాలను గ్యాస్ ఆధారితంగా మార్చుకునేందుకు వినియోగించే పరికరాల పైనా పన్ను శాతాన్ని తగ్గించాలని, తద్వారా దేశంలో పరిశుద్ధమైన ఇంధన వాడకానికి చేయూతనివ్వాలని కోరింది. పర్యావరణ సమతుల్యతపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆటో ఎల్‌పీజీ అత్యంత పరిశుద్ధమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉందని ఐఏసీ స్పష్టం చేసింది. ఇలాంటి ఇంధనానికి 18 శాతం జీఎస్టీ విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టిన హరితాభివృద్ధి ప్రాధాన్య చర్యలకు ఈ పన్ను విధానం పూర్తి విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక ప్రభుత్వాలు ఆటో ఎల్‌పీజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆటో ఎల్‌పీజీ, సీఎన్‌జీ కన్వర్షన్ పరికరాలపై అత్యధిక శ్లాబ్ పన్నురేటు 28 శాతంగా ఉండడం శోచనీయమని ‘జనరల్, ఇండియన్ ఆటో ఎల్‌పీజీ సంకీర్ణం (ఐఏసీ) డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా ఈ ఉందర్భంగా పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఈ పరిశుద్ధ వాహన గ్యాస్ వినియోగం 40 శాతం పెరిగిందన్నారు.