బిజినెస్

కాంట్రాక్టులపై సమీక్ష కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: మార్కెట్ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఎల్‌ఎన్‌జీ ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం సోమవారం సోమవారం చేసిన అభ్యర్థనను ఖతర్ తిరస్కరించింది. ఇరు వర్గాల విశ్వసనీయత కంటే కూడా కాంట్రాక్టుల పవిత్రమే ముఖ్యమని స్పష్టం చేసింది. దీర్ఘకాల సప్లై కాంట్రాక్టులను మళ్లీ తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. క్రూడ్ ఆయిల్‌తో ముడిపెట్టిన రేటుతోనే ఎల్‌ఎన్‌జీ దిగుమతులకు సంబంధించి ఖతర్‌తో రెండు దీర్ఘకాల ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వార్షికంగా 8.5 మిలియన్ డాలర్ల ఎల్‌ఎన్‌జీని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీర్ఘకాల కాంట్రాక్ట్‌లో భాగంగా భారత్‌కు అత్యధిక స్థాయిలో దిగుమతి చేస్తున్న ఎల్‌ఎన్‌జీ రేటును మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఖతర్‌ను కోరినట్టు ఇంధన శాఖ మంత్రి ధర్మంద్ర ప్రదాన్ తెలిపారు. ఖతర్ నుంచి వార్షికంగా భారత్ 8.5 మిలియన్ టన్నుల మేర ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుంటోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌తో ముడిపడివున్న ఈ రేటును ఒక్క బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు 9-10 డాలర్లు పడుతోంది. అయితే, స్టాక్ మార్కెట్‌లో సగం ధరకే ఈ గ్యాస్ లభిస్తోంది. ఇందుకు సంబంధించి భారత్‌లో పర్యటిస్తున్న ఖతార్ ఇంధన మంత్రి అల్‌ఖాబీతో చర్చలు జరిపామని ధరేంద్ర ప్రదాన్ తెలిపారు. ఎల్‌ఎన్‌జీ కాంట్రాక్టులు అన్నవి వర్తమాన మార్కెట్ల వాస్తవాలకు అద్దం పట్టేలా ఉండాలని ఆయన అన్నారు. చమురుతో ముడిపెట్టిన ఎల్‌ఎల్‌జీ ధరల విషయంలో ఇంధన ఉత్పత్తిదారులు పాత పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనికి బదులు డిమాండ్, సరఫరా ప్రాతిపదికన కొత్త పద్ధతుల్లో ముందుకు వస్తే వాస్తవికతకు అద్దం పట్టినట్టు అవుతుందని తెలిపారు. ప్రస్తుత విధానం వల్ల ఎప్పుడు ముడిచమురు ధర పెరిగినా అనివార్యంగా ఎల్‌ఎన్‌జీ రేటును పెంచాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ఖతర్ మంత్రికి కూడా స్పష్టం చేసినప్పటికీ ఆయన నుంచి ప్రతికూల ప్రతిస్పందనే వచ్చింది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని, భారత్‌కు కావాలంటే వివిధ రేట్లపై అదనంగా ఎల్‌ఎన్‌జీని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఖతర్ మంత్రి అల్‌ఖాబీ తెలిపారు.