బిజినెస్

ఫర్నిచర్ దిగుమతులపై నిషేధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దేశీయ ఉత్పత్తులకు మరింత ఊతాన్నించే లక్ష్యంతో ఫర్నిచర్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు అంతర్గత వాణిజ్యం పరిశ్రమల అభివృద్ధి విభాగం కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.
2018-19 సంవత్సరంలో భారత్ ఫర్నిచర్ దిగుమతులు 603 మిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. వీటిలో ఒక్క చైనా నుంచే దిగుమతి చేసుకున్న ఫర్నిచర్ విలువ 311 మిలియన్ డాలర్లు. మలేషియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్‌ల నుంచి ఈ వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఫర్నిచర్ ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో చైనాదే మొదటిస్థానం. అయితే, భారతదేశం మాత్రం ఫర్నిచర్ ఎగుమతుల్లో అత్యంత బలహీనంగానే ఉంది. ఈ రంగం గట్టిగా నిలదొక్కులేకపోవడం వ్యవస్థీకృతం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. దేశీయ ఫర్నిచర్ పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 1.5 బిలియన్ డాలర్లు. శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపైన ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.