బిజినెస్

ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రైవేటుపరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రుణ కూపంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయడంలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూరు శాతం వాటాను విక్రయించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు ప్రకటించింది. ఆసక్తి గల సంస్థలు మార్చి 17లోగా ఇందుకు సంబంధించి దరఖాస్తు దాఖలు చేసుకోవాలని తెలిపింది. వ్యూహాత్మక డిజినె్వస్ట్‌మెంట్‌లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా నూరు శాతం వాటాను అమ్మే అవకాశం కనిపిస్తోంది. అలాగే, సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏఐఎస్‌ఏటీఎస్‌లో కూడా 50 శాతం వాటాను విక్రయించబోతున్నట్టు ఈ ప్రకటనలో తెలిపారు. విజయవంతంగా బిడ్లు దాఖలు చేసిన బిడ్డర్‌కు ఎయిర్‌లైన్స్ యాజమాన్య ఆధిపత్య బాధ్యత కూడా బదిలీ అవుతుంది. దీర్ఘకాలంగా నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియాలో వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ముందుకు రావడం గత రెండు సంవత్సరాల కాలంలో ఇది రెండోసారి. ఆసక్తి కలిగిన వ్యక్తులు నిర్దేశిత డెడ్‌లైన్‌లోగా ఈఓఐని దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసులు, ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు, ఎయిర్ ఇండియా అలైడ్ సర్వీసులు, భారత హోటల్ కార్పొరేషన్‌లో కూడా ఎయిర్ ఇండియాకు వాటాలున్నాయి. వీటన్నింటిని కూడా ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే మరో ప్రత్యేక కంపెనీకి బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇవేవి కూడా తాజా విక్రయంలో భాగం కాదని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ డిజినె్వస్ట్‌మెంట్ ప్రక్రియలో సిబ్బందికి ఎయిర్‌లైన్స్ మొత్తం షేర్లలో మూడు శాతం వాటాను ఇస్తామని, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ కార్యక్రమం కింద షేర్లను అందిస్తామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.