బిజినెస్

జీబీఎస్ రూపంలో అమ్మవారి బంగారం డిపాజిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 28: ఇందక్రీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి కానుకల రూపంలో, హుండీల ద్వారా వచ్చిన బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్ (జీబీఎస్) రూపంలో డిపాజిట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. హుండీల ద్వారా వచ్చిన బంగారం, ఆలయంలో నిరుపయోగంగా ఉన్న బంగారు వస్తువులు, అలంకారానికి వినియోగించని బంగారు వస్తువులను ప్రభుత్వ ఆదేశాలతో గోల్డ్ స్కీము రూపంలోకి మార్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈమేరకు ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. రీజనల్ జాయింట్ కమిషనర్, దేవాదాయ శాఖ జ్యూయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్, దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. మంగళవారం బంగారు వస్తువులను తూకం వేశారు. వచ్చిన బంగారం 21 కేజీల 577 గ్రాములను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాంధీనగర్ శాఖ వారికి గోల్డ్ బాండ్ స్కీమ్ కింద అప్పగించారు.