బిజినెస్

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనదే అగ్ర స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గడచిన రెండు దశాబ్ధాలుగా గుజరాత్ ఆలుగడ్డల సాగులో, ఎగుమతిలో గణనీయమైన వృద్ధిని సాధించి ఇందుకు సంబంధించిన హబ్‌లా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన ‘అంతర్జాతీయ ఆలు సదస్సు’ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఆహార ధాన్యాలు, ఆహార వస్తువుల ఉత్పత్తిలో దేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఇందుకు ప్రభుత్వ విధానాలతోబాటు రైతుల విశేష శ్రమ కారణాలన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. మన దేశంలో ఆలు గడ్డల సాగు గడచిన దశాబ్ధ కాలంలో 20 శాతం పెరిగిందని, ప్రత్యేకించి గుజరాత్‌లో 170 శాతం పెరిగిందని వివరించారు. రైతులు సాగులో అనుసరించిన ఆధునిక విధానాలు ఉపయుక్తంగా ఉన్నాయని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చాలినంత సాగునీటి సౌకర్యాన్ని కల్పిచడంతోబాటు, ప్రోత్సాహకాలను సైతం రైతులకు అందజేస్తోందని వివరించారు. ‘సుజలాం సుఫలాం’, ‘సౌని యోజన’ వంటి ప్రభుత్వ పథకాలు కరవు పీడిత ప్రాంతాల్లో సైతం మంచి సాగునీటి సదుపాయాలతో సశ్యశ్యామలం అయ్యేలా చేస్తున్నాయన్నారు. ‘అతి తక్కువ వ్యవధిలోనే భారీ సాగునీటి కాలువల సదుపాయాలు కలగచేయడం జరిగిందని, ఇది అతిపెద్ద లక్ష్య సాధన’ అని మోదీ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ఆలుగడ్డల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టిందన్నారు. ఈనెలారంభానికి ముందే ప్రధాన మంత్రి సమ్మాన్ యోజన పథకం ద్వారా సుమారు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 12,000 కోట్లు బదిలీ చేసి కేంద్రం రికార్డు సృష్టించిందని ప్రధాని గుర్తు చేశారు. వంద శాతం కేంద్ర నిధులతో కూడిన ఈ పథకం ద్వారా ప్రతి రైతు వార్షికాదాయ వెన్నుదన్నుగా రూ. 6000 లబ్ధి పొందుతున్నారని, ప్రతి నాలుగు నెలలకోమారు రూ. 2000 వంతున ఈ పథకం ద్వారా జమ అవుతోందని వివరించారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఆధునిక, విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసి వ్యవసాయ క్షేత్రం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్, సరఫరా వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే రైతు ఉత్పత్తుల సంస్థ(ఎఫ్‌పీఓ)లను ప్రోత్సహించి రైతులు సాంకేతిక పరంగా, మార్కెట్ పరంగా ఎదిగేందుకు కృషి చేయాలని నిర్ణయించామని మోదీ తెలిపారు. కొత్తగా 10వేల కొత్త ఎఫ్‌పీఓలను వచ్చే ఐదేళ్లలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉందన్నారు. ఇలావుండగా ఆహారం, బలవర్ధకత అంశాలపై చర్చించి సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు ఈ సదస్సుకు అనేక మంది శాస్తవ్రేత్తలు, వాణిజ్య వేత్తలు, ఆలు సాగు చేసే రైతులు హాజరయ్యారు.
*చిత్రం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ