బిజినెస్

రికార్డు స్థాయి దిగుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో రుతుపవనాలు మెరుగ్గా ఉండటంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పెరుగుతుందని, గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 124.01 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది 135.03 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే పప్పు్ధన్యాల ఉత్పత్తి కూడా ఎంతో మెరుగుపడి మార్కెట్లో వాటి ధరలు దిగివస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో గత రెండేళ్లు వరుసగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 252 మిలియన్ టన్నుల స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంట కోతలు ప్రారంభమవడంతో ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన తొలి ముందస్తు అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ గురువారం విడుదల చేశారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో 91.31 మిలియన్ టన్నులుగా ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 93.88 మిలియన్ టన్నులకు పెరిగి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటుందని, అలాగే గత కొన్ని నెలల నుంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిన పప్పు ధాన్యాల ఉత్పత్తి 5.54 మిలియన్ టన్నుల నుంచి 8.7 మిలియన్ టన్నులకు వృద్ధి చెందుతుందని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో అధిక ధర లభిస్తుండటం, కనీస మద్దతు ధరను ప్రభుత్వం గణనీయంగా పెంచడంతో రైతులు విస్తారంగా పప్పు్ధన్యాలను సాగుచేస్తున్నారు. దీంతో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 5.54 మిలియన్ టన్నులుగా ఉన్న పప్పు్ధన్యాల దిగుబడి ఈ ఏడాది 57 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 8.7 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.