బిజినెస్

ఐదోవిడత గోల్డ్ బాండ్ల ద్వారా రూ.820 కోట్ల రాబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అయిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా రూ. 820 కోట్లకు పైగా సేకరించగలుగుతామని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే తదుపరి విడుదల చేయబోయే గోల్డ్ బాండ్స్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్సతో దీపావళికి ముందే విడుదల చేయాలని కూడా భావిస్తోంది. ‘అయిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా వచ్చే మొత్తం రూ, 820 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నాం. దాదాపు 2.37 టన్నుల బంగారానికి సంబంధించి 2 లక్షలకు పైగా దరఖాస్తుల ద్వారా ఈ మొత్తం లభిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. చివరి రోజున భారీ సంఖ్యలో అందిన దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఆఫీసులు ఇంకా అప్‌లోడ్ చేస్తున్నందున ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగో విడత గోల్డ్ బాండ్స్ ద్వారా ప్రభుత్వం రూ. 921 కోట్లు సమీకరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మరిన్ని విడతల బంగారు బాండ్లను విడుదల చేస్తుందని, తదుపరి విడత అక్టోబర్ నెల మూడో వారంలోనే ఉండవచ్చని, మరింతమంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు వీలుగా మరిన్ని అదనపు ఫీచర్లు దీనిలో ఉంటాయని ఆ ప్రకటన తెలిపింది. అయిదో విడత సావరిన్ బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ. 3,150గా లెక్క కట్టారు. ఆగస్టు 22-26 తేదీల మధ్య వారంలో బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ ధరను నిర్ణయించారు.