బిజినెస్

‘బ్రాండ్‌వర్క్స్’తో కొత్త డెలివరీ బ్రాండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: స్విగ్గీ.. నగర యువతకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. అవును, వినియోగదారులకు సమీపంలోని ఏ హోటల్ నుంచి ఏ ఆహారం కావాలో యాప్ ద్వారా ఆర్డర్ తీసుకొని, వాటిని ఆయా హాటళ్లలో తయారు చేయించి సరఫరా చేస్తున్న సంస్థ ఇది. అయితే, స్విగ్గీ ఇప్పుడు ‘బ్రాండ్‌వర్క్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తన భాగస్వామ్య రెస్టారెంట్లతో కలిసి ‘డెలివరీ బ్రాండ్ల’ను ఏర్పాటు చేయడానికి ‘బ్రాండ్‌వర్క్స్’ను తెస్తున్నట్టు స్విగ్గీ వివరించింది. స్విగ్గి ప్రస్తుతం కూర్చొని తినే సౌకర్యం ఉన్న తన భాగస్వామ్య రెస్టారెంట్లకు వివిధ ఆహారాలను ఆర్డర్ చేస్తూ, వాటిని సంబంధిత వినియోగదారులకు సరఫరా చేస్తోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే ‘బ్రాండ్‌వర్క్స్’తో సృష్టించే ‘డెలివరీ బ్రాండ్ల’కు ఇలాంటి ‘డైన్-ఇన్ రెస్టారెంట్ల’తో సంబంధం ఉండదు. ఇది తక్కువ పెట్టుబడి కలిగిన విధానమని స్విగ్గీ తన ప్రకటనలో వివరించింది. ఈ విధానం వేగంగా విస్తరిస్తుందని, నామమాత్రపు మూలధనం పెట్టుబడితో ఏర్పాటయిన రెస్టారెంట్లకు ఆది నుంచే ఆదాయాన్ని కల్పిస్తుందని స్విగ్గీ తెలిపింది. భాగస్వాములందరికి ఈ విధానం ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది. ‘రెస్టారెంట్ భాగస్వాముల కోసం ఇప్పటికే వెయ్యికి పైగా కిచెన్లను సృష్టించడం జరిగింది. మేము ఇప్పుడు మా బ్రాండ్‌వర్క్స్ కార్యక్రమం ద్వారా డెలివరీ బ్రాండ్లను సృష్టించడం ద్వారా మా వినియోగదారులకు ఇప్పటి వరకు అందని సేవలను కూడా అందించనున్నాం’ అని స్విగ్గీ కొత్త సప్లై సీఈఓ విశాల్ భాటియా తెలిపారు.