బిజినెస్

దేశీయ మార్కెట్లకు నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 13: స్థూలార్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో పాటు చైనాలో తాజాగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరగడం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే గురువారం 106.11 పాయింట్లు (0.26 శాతం) పడిపోయి, 41,459.79 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 26.55 పాయింట్లు (0.22 శాతం) పడిపోయి, 12,174.65 పాయింట్ల వద్ద స్థిరపడింది.
చైనాలో కరోనా వైరస్ కారణంగా తాజాగా మరో 200కు పైగా మంది మృతి చెందడంతో పాటు కొత్త రోగ నిర్ధారక పరీక్షలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య బాగా పెరగడం ప్రపంచ స్టాక్ మార్కెట్లను ఊగిసలాటకు గురిచేసింది. బుధవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడిన స్థూలార్థిక గణాంకాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులను నిరుత్సాహానికి గురిచేశాయి. దేశ పారిశ్రామికోత్పత్తి డిసెంబర్ నెలలో 0.3 శాతం తగ్గడంతో పాటు ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం జనవరి నెలలో 68 నెలల గరిష్ఠ స్థాయి అయిన 7.59 శాతానికి పెరిగింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం వల్ల వడ్డీ రేట్లపై ఆధారపడిన బ్యాంకింగ్, ఫైనాన్స్, వాహన షేర్ల విలువ పడిపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ గురువారం అత్యధికంగా నష్టపోయింది. దీని షేర్ విలువ 3.68 శాతం పడిపోయింది. ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ తరువాత స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు, టైటాన్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా షేర్ల విలువ 2.37 శాతం వరకు పెరిగింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని 30 సంస్థల్లో 16 సంస్థల షేర్ల విలువ దిగజారగా, 14 సంస్థలు లాభపడ్డాయి.
‘ప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడం, జనవరి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం పెరగడం వల్ల స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. మరిన్ని సానుకూల సంకేతాల కోసం ఎదురుచూసిన ఇనె్వస్టర్లను ఇవి నిరుత్సాహానికి గురిచేశాయి. కోర్ ఇన్‌ఫ్లేషన్ 3.5 శాతం నుంచి 4.2 శాతానికి పెరిగిన నేపథ్యంలో వినియోగ వస్తువుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదల కూడా ఆర్‌బీఐ ఇప్పట్లో కీలక వడ్డీ రేట్లను తగ్గించబోదనే సంకేతాలను ఇస్తోంది. వడ్డీ రేట్లపై ఆధారపడిన స్టాక్‌లను ఇది ప్రభావితం చేస్తుంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గురువారం నాటి లావాదేవీలలో బీఎస్‌ఈ బ్యాంక్, ఫైనాన్స్, యుటిలిటీస్ రంగాల సూచీలు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. కాగా, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, టెక్నాలజి రంగాల షేర్ల విలువ 1.06 శాతం వరకు పెరిగింది.