బిజినెస్

అపాక్ దేశాలకు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కరోనా వైరస్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. భయంకరమయిన ఈ కొత్త వైరస్ ఇప్పటికే చైనాలో 1,100కు పైగా మందిని పొట్టన పెట్టుకుంది. ఈ వైరస్ విజృంభణ ఇలాగే కొనసాగితే, ఆసియా-పసిఫిక్ (అపాక్) రీజియన్‌లోని ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. దీని ప్రతికూల ప్రభావం బ్యాంకులపై మరింత తీవ్రంగా ఉంటుంది. బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత దెబ్బతింటాయి. కరోనా వైరస్ ప్రభావంపై ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా ఇది. చైనాలో గత నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయిన తరువాత దేశంలోని అనేక ప్రాంతాలు మూతపడిన పరిస్థితిలోకి వెళ్లాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ అంటు వ్యాధిని తీవ్ర ప్రమాదకరమయిందిగా అభివర్ణించడంతో పాటు అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈరోజు చైనా ఏకైక అతిపెద్ద మూలాధార మార్కెట్‌గా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావం ప్రయాణాలు, పర్యాటకం, వినియోగం, సరుకుల ధరలపై పడుతుంది. వైరస్ వ్యాప్తి వల్ల సరఫరా మార్గాలకు కలిగే అంతరాయం బ్యాంకులను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా బ్యాంకుల లాభదాయకత తగ్గిపోతుంది. వాటి ఆస్తుల నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందని మూడీస్ ఒక నోట్‌లో హెచ్చరించింది. ‘కరోనా వైరస్ అంటు వ్యాధి మరింత తీవ్రమయితే, దాని వల్ల కలుగుతున్న అంతరాయాలను, ఆటంకాలను రానున్న కొన్ని నెలల్లో నియంత్రించకపోతే ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోని బ్యాంకుల ఆస్తుల నాణ్యతను, లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ‘కరోనా వైరస్ తీవ్రత, విస్తృతి ఇంకా అధిక అనిశ్చితిలోనే ఉంది. ఒకవేళ వైరస్ సంబంధిత అంతరాయాలు స్వల్ప కాలం పాటే ఉంటే, ఆసియా-పసిఫిక్ (అపాక్) ఆర్థిక వ్యవస్థలు, బ్యాంకులపై దాని ప్రతికూల ప్రభావం పరిమితంగా ఉంటుంది. అలాకాకుండా ఈ అంటు వ్యాధి దీర్ఘకాలం పాటు కొనసాగితే, దాని ప్రతికూల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది’ అని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ప్రజల ప్రయాణాలు తగ్గుతున్నాయి. ఇది సాధారణంగా ఈ రీజియన్‌లో ఆర్థిక వృద్ధిని, ఉపాధి అవకాశాలను బలహీనపరుస్తుంది. ప్రత్యేకించి విదేశీ ప్రయాణికులు, పర్యాటకులపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు మరింత దెబ్బతింటాయి. ‘ఈ పరిస్థితి బ్యాంకుల ఆస్తుల నాణ్యతను దెబ్బతీస్తుంది. రుణ వ్యయం పెరిగి, లాభదాయకత తగ్గుతుంది’ అని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ వివరించింది.