బిజినెస్

లాభనష్టాల్లో ఊగిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: ఈవారం భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఆర్బీఐ రెపో రేట్లపై నిర్ణయం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనల వరకూ ఎన్నో అంశాలు భారత మార్కెట్లను శాసించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి మరోసారి భారత్‌ను కూడా ప్రభావితం చేసింది. గత వారం లాభాల బాటలో పరుగులు తీసిన బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఈవారం అందుకు భిన్నంగా నష్టాలతో ప్రారంభమయ్యాయి. లావాదేవీలకు తొలి రోజైన సోమవారం బీఎస్‌ఈలో సెనె్సక్స్ 162.23 పాయింట్లు కోల్పోయి, 40,978.62 పాయింట్లకు పతనమైంది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 66.85 పాయింట్లు నష్టపోవడంతో 12,031.50 పాయింట్లకు పడిపోయింది. తొలి రోజునే ప్రతికూల సంకేతాలు కనబడడంతో అంతా నీరుగారిపోయారు. అయితే, తర్వాతి రెండురోజుల్లో మార్కెట్లు కోలుకున్నాయి. మంగళవారం సెనె్సక్స్ 236.52 పాయింట్లు మెరుగుపడి, 41,216.14 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 76.40 పాయింట్లు లాభాలను ఆర్జించి 12,07.90 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం కూడా ఇదే ఒరవడి కొనసాగింది. ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన మార్కెట్లు పరుగులు తీశాయి. సెనె్సక్స్ 349.76 పాయింట్లు మెరుగుపడి, 41,565.90 పాయింట్లకు దూసుకెళ్లింది. 93.30 పాయింట్లు లాభపడి, 12,201.20 పాయింట్లకు చేరింది. అయితే, రెండు రోజుల వరుస లాభాలకు గురువారం గండిపడింది. హెచ్చుతగ్గుల మధ్య కొట్టుమిట్టాడిన సెనె్సక్స్ చివరికి 106.11 పాయింట్లు నష్టపోయి, 41,459.79 పాయింట్లుగా నమోదైంది. నిఫ్టీ 26.55 పాయింట్ల నష్టం కారణంగా 12,174.65 పాయింట్లకు పతనమైంది. ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 202.05 పాయింట్లు నష్టపోయి 41,257.74 పాయింట్లకు పడిపోయింది. అదే విధంగా 61.20 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 12,113.45 పాయింట్ల వద్ద ముగిసింది.