బిజినెస్

వృద్ధిరేటు పెంచేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కుంటుపడిన వృద్ధిరేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందు కోసం అవసరమైతే 2020-2021 వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతిపాదనలతో సంబంధం లేకుండా సరికొత్త నిర్ణయాలను తీసుకొని, అమలు చేసేందుకు వెనుకాడబోమని ప్రకటించారు. గత 11 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత అత్యల్పంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు కేవలం ఐదు శాతంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఆర్థిక మాంద్యం దాదాపు అన్ని దేశాలను బాధిస్తున్నదని బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగే ‘బడ్జెట్ అండ్ బియాండ్’ సదస్సులో మాట్లాడుతూ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, మన దేశంపై ఈ ప్రభావం తక్కువగా ఉందన్నారు. వృద్ధిరేటుకు ఊతం ఇవ్వడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆమె అన్నారు.

*చిత్రం...‘బడ్జెట్ అండ్ బియాండ్’ సదస్సు దృశ్యం