బిజినెస్

సంస్కరణల కొనసాగింపు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అనివార్యంగా కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వ్యవస్థాగత సంస్కరణలను కొనసాగించడం ద్వారా డిమాండ్‌ను పునరుద్ధరించగలుగుతామని, అలాగే ఆర్థిక వ్యవస్థకూ మరింత మద్దతు ఇవ్వగలుగుతామని ఆయన తెలిపారు. ప్రస్తుత మాంద్య పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలంటే అన్ని రకాలుగానూ సానుకూల చర్యలు ఎంతో అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. చైనాలో తలెత్తిన కరోనా వైరస్ ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రతిపాదనలు, అలాగే తాజాగా ప్రకటించిన ఆర్థిక అనుకూల చర్యలు డిమాండ్ పెరగడానికి వినియోగ స్థాయి ఇనుమడించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. అయినప్పటికి కూడా భూసంస్కరణలు, కార్మిక సంస్కరణలు తీసుకురావాలని, వ్యవసాయ మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ముఖ్యంగా నైపుణ్య అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ఆర్థిక మాంద్యానికి అనేక అంశాలు ప్రధానంగా కారణం అయ్యాయని, అయినప్పటికి కూడా కొన్ని సానుకూల పరిస్థితులు కూడా కొత్త ఆశలు కలిగిస్తున్నాయని అన్నారు. తాజా పరిణామాలు ఆర్థిక ఊతానికి సంబంధించిన ఆశలు కలిగిస్తున్నా అవి ఎంతవరకు నిలబడతాయన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటివరకు తీసుకున్న సానుకూల చర్యల ఫలితంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అన్నారు. 2021 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటును అంచనా వేశామని తెలిపారు.