బిజినెస్

జీఎస్‌టీ చట్టం ఉల్లంఘన.. ఏపీలో తొలి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్‌టీ చట్టం కింద రాష్ట్రంలో మొదటి అరెస్ట్ నమోదు చేశారు. విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో గాజువాక సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది కలిసి శేఖర్ ట్రేడర్స్, వెంకట సాయి ట్రేడ ర్స్ యజమాని దుడ్డు శేఖర్‌ను ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఇతను పాత ఇనుము వ్యాపారం చేయడానికి గాజువాక సర్కిల్‌లో రిజిస్ట్రేషన్ పొందాడు. రూ. 14.40 కోట్ల టర్నోవరుపై రూ. 2.60 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ లావాదేవీలో తెలంగాణాలోని అదే వ్యాపారస్తులకు అమ్మి, వారి వద్ద నుండే కొన్నట్లు చూపించారు. పై సంస్థల యజమాని రాష్ట్ర జీఎస్‌టీ చట్టం 2017లోని 132వ సెక్షన్ ప్రకారం నేరం చేసినట్లు నిర్ధారించి 69వ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేశారు. అతనిని ప్రత్యేక ఆర్థిక నేరాలు, జిల్లా సెషన్స్ జడ్జీ ముందు ఈ నెల 16న ప్రవేశపెట్టారు. కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించగా అతడిని విశాఖ కేంద్ర కారాగారంలో అప్పచెప్పారు. ఈ విషయంలో తదుపరి విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుని పన్ను రాబడతారు. ఇలాంటి లావాదేవీలు మరి కొంత మంది వ్యాపారస్తులు నిర్వహించినట్లు మొత్తం పన్ను విలువ రూ. 10 కోట్ల వరకు ఉండవచ్చని ప్రాథమిక పరిశీలనలో తేలిందని చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ తెలిపారు.