బిజినెస్

బుల్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: భారత స్టాక్ మార్కెట్లలో బుధవారం బుల్ రన్ కొనసాగింది. ఆరంభంలో నష్టాల్లో ట్రేడైన వివిధ కంపెనీల షేర్లు ఆ తర్వాత పుంజుకుని లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 428.62 పాయింట్లు మెరుగుపడి, 41,323 పాయింట్లకు చేరింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 133.40 పాయింట్లు పుంజుకుని 12,125.90 పాయింట్లకు చేరింది. మొత్తమీద ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు మిగతా కంపెనీల వాటాల కంటే ఎక్కువ లాభాలను నమోదు చేసుకున్నాయి. ఈ కంపెనీ వాటాలు 2.79 శాతం లాభాల్లో ట్రేడ్ కావడం విశేషం. హెచ్‌యూఎల్ 2.74 శాతం లాభాలతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. గత వారం మార్కెట్ విలువను భారీగా పెంచుకున్నప్పటికీ రియలన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాలు 3.60 శాతం మాత్రమే లాభాలను ఆర్జించాయి. ఓఎన్‌జీసీ 2.47 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.32 శాతం చొప్పున లాభాలు సంపాదించుకున్నాయి. మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ సన్‌ఫార్మా షేర్లు 1.33 శాతం నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్ 0.93 శాతం, భారతీయ ఎయిర్‌టెల్ 0.80 శాతం, ఎల్ అండ్ టీ 0.38 శాతం, ఇండస్‌ఇండ్ 0.28 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి.
బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ ట్రే డింగ్ ఉదయం నష్టాల్లో కొనసాగినప్పటికీ ఆ త ర్వాత మెరుగుపడింది. కొనుగోళ్ల పట్ల మదుపరు లు ఆసక్తి ప్రదర్శించడంతో వివిధ కంపెనీల షేర్ల ధరలకు రెక్కలు వచ్చాయి.
భారతీ ఇన్‌ఫ్రా 7 శాతం లాభాలను ఆర్జించడం విశేషం. గ్రాసిమ్ 4.41 శా తం, కోల్ ఇండియా 3.46 శాతం జీ ఎంటర్‌టైన్‌మెంట్ 2.81 శాతం, హెచ్‌యూఎల్ 2.76 శాతం చొ ప్పున లాభాలను సంపాదించుకున్నాయి. అయితే, టాటా మోటార్స్ షేర్లు 2.17 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాల పరంపర కొనసాగుతోంది. ఈ కంపెనీ షేర్లు 1.40 శాతం నష్టపోయాయి. సన్‌ఫార్మా 1.32 శాతం, టీసీఎస్ 0.98 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.78 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి.