బిజినెస్

1000 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: దేశ అవసరాల కోసం 2024 నాటికి సింగరేణి బొగ్గు గనుల నుంచి దాదాపు 1000 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలతో సింగరేణి వ్యూహాత్మకంగా ముందకు అడుగులు వేస్తోంది. బొగ్గు ఉత్పత్తులపై దేశ వ్యాప్తింగా వస్తున్న సవాళ్లను అధికమించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుజరాత్ కేవడియాలో‘ చింతన్ శిబర్’ మేథోమథన్ కార్యక్రమం జరిగింది. ఈ మేథోమథన్‌కు సింగరేణి నుంచి సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ హాజరు అయ్యారు. గత రెండు రోజులుగా గుజరాత్ కేవడియాలో సింగరేణి పనితీరు, వ్యాపార విస్తరణ చర్యలపై ‘ చింతన్ శిబిర్’ మేథో మథన్ సదస్సులో నర్సింహరావు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యచరణపై కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లో మేథో మథన కార్యక్రమం జరగడం మంచి ఫలితాలు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి విధానం, వృద్ధిరేటు, వ్యాపార విస్తరణపై చేపట్టిన చర్యల పట్ల మేథో మథన్ అందరి దృష్టి ఆకర్శించిందన్నారు. మేథో మథన్‌లో సింగరేణిలో జరుగుతున్న వివిధ వృద్ధి పట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివవరించారు. 2024 నాటికి 1000 మిలియన్లి టన్నుల బొగ్గు ఉత్పత్తి అసాధ్యమేమీకాదని సింగరేణి సీఎండీ శ్రీదర్ స్పష్టం చేశారు. తన వంతుగా 85 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా గురువారం కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ కోలిండియా ఇకపై కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉండబోతోందని, థర్మల్ సోలార్ విద్యుత్ రంగాల్లోకి విస్తరించి ముందకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. 2024 నాటికి 1000 మిలియన్ల బొగ్గుతో పాటు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లలను గనుల సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో నెలకొల్పాలని ఆయన సింగరేణి అధికారులకు సూచించారు. ఛ కార్యక్రమంలో దేశ వ్యాప్త బొగ్గు సంస్థల చైర్మెన్లు, సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
*చిత్రం... సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు