బిజినెస్

3వేల కోట్లతో సింగరేణి బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ అవసరాల కోసం సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గు తవ్వకాల కోసం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కోట్ల బడ్జెట్‌కు సంస్థ ఆమోదించింది. ఈ నిధులతో 675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు సరఫరా చేయాలని సంస్థ నిర్ణయించింది. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లతో శనివారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశానికి సీఎండీ శ్రీధర్ హాజరయ్యారు. సంస్థ డైరెక్టర్లనుద్దేశించి సీఎండీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బొగ్గు అవసరాలు అధికమవుతున్నాయిని, దీనిని దృష్టిలో పెట్టుకుని సింగరేణి నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రణాళికలను రూపొందించాలన్నారు. లక్ష్యాలను అధిగమించడానికి డైరెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. సింగరేణితో పాటు ఒడిశా రాష్ట్రంలో బొగ్గు గనుల తవ్వకాలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. బొగ్గు తవ్వకాల కోసం తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి సింగరేణి బోర్డు ఆమోదించిందన్నారు. ఓపెన్ కాస్టు గనులకు సంబంధించి వివిధ రకాల ఓబీ తొలగింపు పనులకు కూడా సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓసీ గనుల్లో ధూళి నివారణకు వినియోగించే స్ప్రింక్లర్లు, ట్యాంకర్ల కొనుగోలుకు, భారీ సామాగ్రి తరలించేందుకు క్రేన్ల కొనుగోలుకు సంస్థ ఆమోద ముద్రవేసిందని ఆయన తెలిపారు. మైన్‌ప్లాన్లకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలు కూడా బోర్డు తన అంగీకారం తెలిపింది. సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ పీఎస్‌ఎల్ స్వామి, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్,, భాస్కర్‌రావు, ఎన్ బలరాం, ఆంటోని రాజా, కంపెనీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, పీఆర్‌వో మహేష్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... సింగరేణి బోర్డ్ డైరెక్టర్లతో మాట్లాడుతున్న సంస్థ సీఎండీ శ్రీధర్