బిజినెస్

తీసికట్టు విమాన యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ నగరం పాలనా రాజధానిగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు అనుసంధానత పెరగాల్సిన తరుణంలో నానాటికీ దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ స్థాయి నగరంగా కీర్తినందుకుంటున్నప్పటికీ విమానయాన రంగంలో సర్వీసుల కుదింపు అటు పారిశ్రామిక వర్గాలను, ఇటు పర్యాటకులకు మింగుడుపడని అంశమే. విశాఖ నగరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 72 సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో కేవలం మూడు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు. విభజన అనంతరం అతిపెద్ద నగరం విశాఖ మాత్రమే. రక్షణ రంగం ఆధీనంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రం ఉన్నది విశాఖలోనే. ఐటీ, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు విశాఖ కీలక నగరం. నవ్యాంధ్రలో విమాన ప్రయాణీకుల సగటు వృద్ధిలో గణనీయమైన ప్రగతి కూడా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ డొమెస్టిక్ సర్వీసుల అవసరం కూడా పెరిగింది.
ఇంతలా అవసరాలు పెరుగుతుంటే కొత్త సర్వీసులు నడపేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఉన్న సర్వీసులనే విమానయాన సంస్థలు రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా విశాఖ - చెన్నై - హైదరాబాద్ (ఇండిగో) సర్వీసు, విశాఖ - కోల్‌కతా (ఎయిర్ ఏసియా) సర్వీసును మార్చి నెల నుంచి నిలిపివేస్తున్నట్టు ఆయన సంస్థల ప్రకటన విమానయాన ప్రయాణీకులకు శరాఘాతంలా తగిలింది. దీనితో పాటు విశాఖ - న్యూఢిల్లీ (స్పైస్ జెట్) సర్వీసును కొద్ది రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. విశాఖ పాలనా రాజధానిగా దాదాపు ఖరారైన నేపథ్యంలో విశాఖ - విజయవాడ మధ్య సర్వీసులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో మరిన్ని సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎప్పటి నుంచో విశాఖ నుంచి సరకు రవాణాకు ప్రత్యేక సర్వీసు డిమాండ్ ఉంది. తాజాగా చెన్నై - విశాఖ - కోల్‌కతా మీదుగా సూరత్‌కు కార్గో సర్వీసు నడిపేందుకు లాంఛనాలు పూర్తి కావడం సంతోషించతగ్గ పరిణామం.