బిజినెస్

సింగరేణి టర్నోవర్ రూ. 16 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కొత్తగూడెం: ఏప్రిల్ 1: బొగ్గు ఉత్పాదనలో రికార్డు సృష్టించిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 16,000 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తిలో 525 లక్షల టన్నులపై 15 శాతం వృద్ధి సాధించి, 127 ఏళ్ల సింగరేణి చరిత్రలో 60.03 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించామని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీధర్ చెప్పారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల మార్చి 31తో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన ఘన విజయాలను వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తిలో అదనంగా 15 శాతం వృద్ధి నమోదు కావడంతో టర్నోవర్ రెండు వేల కోట్లు పెరిగి రూ. 16,000 కోట్లకు చేరుకుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 25 కొత్త గనులను ప్రారంభించి తద్వారా వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రూ. 35,000 కోట్ల టర్నోవర్‌ను చేరుకునే దిశగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు 13.8 మిలియన్ టన్నుల అదనపు సామర్ధ్యంతో 7 కొత్త గనులు ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంతో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందని, ఆ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మూడో యూనిట్‌ను కూడా జైపూర్‌లోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి చెప్పామ న్నారు. కాగా, గత నెల 13న మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేయడం జరిగిందని, ఈ నెలలో రెండో యూనిట్ సింక్రనైజేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సిఎండి వెల్లడించారు. వ్యయాన్ని తగ్గించుకుం టూ, ఉత్పత్తిని పెంచుకుంటూ మెరుగైన టర్నోవర్‌ను సాధిస్తున్నామని చెప్పారు. అయతే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు గణనీయంగా పడిపోవడం, విదేశీ బొగ్గు దిగుమతుల వల్ల పోటీ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో బొగ్గు ఎగుమతులు చేయడం లేదని అన్నారు. అయనప్పటికీ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేస్తున్నామని చెప్పారు. కోల్ వాషరీలను ఏర్పాటు చేసి నాణ్యమైన బొగ్గును అందించవచ్చని, కానీ ఉత్పాదక వ్యయం పెరుగుతుందన్నారు. అయినప్పటికీ రాన్ను రోజుల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 10 కోల్‌వాషరీలను ఏర్పాటు చేసి నాణ్యతపైనే దృష్టిసారిస్తామని చెప్పారు. గత ఏడాదిలో 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్న సిఎండి బొగ్గు ఉత్పత్తి పెరగడం, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా మరిన్ని ఉద్యోగాలు సింగరేణి ప్రాంత వాసులకు వచ్చే అవకాశం ఉందన్నారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్థేశించుకున్న 60.03 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సమష్టి కృషితో సాధించగలిగామని సింగరేణి డైరెక్టర్లు తెలిపారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ బిక్కి రమేష్‌కుమార్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ ఎ మనోహర్‌రావు, ఫైనాన్స్ అండ్ పా డైరెక్టర్ జె పవిత్రన్ కుమార్, ఇఅండ్‌ఎం డైరెక్టర్ పి రమేష్‌బాబులు మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష మేరకు సంస్థ సిఎండి శ్రీ్ధర్ సారథ్యంలో సింగరేణి ప్రగతిపథంలో పయనించడం ఖాయమన్నారు. సింగరేణీయులు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థగా సింగరేణి అవతరించబోతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన థర్మల్ పవర్ ప్లాంట్ కీలకపాత్ర పోషించనున్నదని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ ఎక్కువ శాతం యాంత్రీకరణతోనే నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించిన సింగరేణీయులకు ముఖ్యమంత్రి కెసిఆర్, సంస్థ సిఎండి శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారని వివరించారు.
లక్ష్యసాధనలో వెనుకబడ్డ కోల్ ఇండియా
న్యూఢిల్లీ: మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడింది. 550 మిలియన్ టన్నులకుగాను గత ఆర్థిక సంవత్సరం 536 మిలియన్ టన్నులతోనే సరిపెట్టింది. అయతే అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2014-15తో పోల్చుకుంటే 42 మిలియన్ టన్నుల ఉత్పత్తి అధికంగా సాధించి 8.5 శాతం వృద్ధిరేటును అందుకుంది.