బిజినెస్

ముగిసిన బీపీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 29: నగరంలో చేపట్టిన అనధికార భవనాల క్రమబద్ధీకరణ స్కీమ్ శనివారంతో ముగిసింది. ఈమేరకు గత ఏడాది ప్రారంభమైన ఈస్కీమ్‌లో గుర్తించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరించేందుకు గాను ప్రారంభించిన బీపీఎస్ శనివారం ముగియడంతో శుక్ర, శనివారాలలో ప్రత్యేక బీపీఎస్ మేళా నిర్వహించి అపరిష్కృతంగా ఉన్న పలు దరఖాస్తులను పరిష్కరించారు. ఈమేరకు నిర్వహించిన మేళాలో మొత్తం 21 దరఖాస్తులు రాగా, వీటిలో నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉండి, ఫీజులు చెల్లించిన 18 దరఖాస్తుల భవనాల ప్లాన్లను క్రమబద్ధీకరించారు. వీటి ద్వారా వీఎంసీ ఖజానాకు సుమరు రూ.3కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు సిటీ ప్లానర్ ఏ లక్ష్మణరావు పేర్కొన్నారు. బీపీఎస్ ముగిసినందున ఇంకా క్రమబద్ధీకరించుకోని భవనాలపై త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామన్న ఆయన ఆయా నిర్మాణాలను అనధికార నిర్మాణాలుగానే గుర్తించడం జరుగుతుందన్నారు.