బిజినెస్

పోర్టుల అభివృద్ధికి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఓడ రేవుల్లో ప్రపంచ స్థాయి వౌలిక సదుపాయాల కల్పన జరగాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశంలోనే ప్రముఖ ఓడరేవుల అధిపతులతో శనివారం ఇక్కడ ఏర్పాటైన ‘చింతన్ బైటక్’లో ఉప రాష్ట్రపతి ముఖాముఖి అయ్యారు. చైరపర్సన్లు, అడ్మినిస్ట్రేర్లను ఉపరాష్ట్రపతి దిశ నిర్దేశన చేశారు. ఎగుమతి, దిగుమతులకు అనువైన స్నేహపూరిత వాతావరణం ఓడ రేవుల్లో రావల్సి ఉందని వెంకయ్య ఆకాంక్షించారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఉప రాష్టప్రతి మాట్లాడుతూ భారత్‌కు విస్తారమైన తీర ప్రాంతం ఉందని అన్నారు. తీర ప్రాంత అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఓడ రేవులను అభివృద్ధి చేసుకోవాలని తద్వారా విదేశీ మారక ద్రవ్యం సమకూర్చుకోవాలని వెంకయ్య పేర్కొన్నారు. 5 ట్రిలియన్ యూఎస్ డాలర్ల లక్ష్యంగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ఓడ రేవుల అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని పోర్టులను అభివృద్ధి చేసుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ వ్యయాన్ని మదించడడం ద్వారా టోర్నోవర్ పెంచుకోవాలని ఆయన సూచించారు. ‘తీర ప్రాంతాన్ని రవాణా వ్యవస్థ హబ్‌గా అభివృద్ధి చేసుకోవాలి. దీని కోసం మరిన్ని చర్యలు తీసుకుందాం’అని వెంకయ్యనాయుడు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే చింతన్ బైటక్ ఆదివారంతో ముగుస్తుంది. దేశంలో పోర్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
తమిళనాడులోని మామల్లాపురంలో శనివారం అన్ని పోర్ట్ ట్రస్టుల చైర్‌పర్సన్లతో సమావేశమైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు