బిజినెస్

దేశీయంగా సైనిక హెలికాప్టర్ తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టడానికి పూనుకుంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు బరువు కలిగిన ఒక యుద్ధ హెలికాప్టర్‌ను 2027 నాటికి తయారు చేయడానికి గ్రౌండ్‌వర్క్‌ను ప్రారంభించింది.
బోయింగ్ సంస్థ తయారు చేస్తున్న అపాచీ వంటి ప్రపంచంలోని మధ్య శ్రేణి యుద్ధ హెలికాప్టర్లను హెచ్‌ఏఎల్ తయారు చేయబోయే హెలికాప్టర్ పోలి ఉంటుంది. హెచ్‌ఏఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఆర్.మాధవన్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. త్రివిధ దళాల కోసం రానున్న సంవత్సరాలలో రూ. 4లక్షల కోట్లకు పైగా విలువయిన మిలిటరి హెలికాప్టర్ల దిగుమతిని ఆపివేయాలనే లక్ష్యంతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టినట్టు మాధవన్ వివరించారు. హెచ్‌ఏఎల్ ఈ హెలికాప్టర్ ప్రాథమిక ఆకృతిని పూర్తి చేసిందని, కనీసం 500 యూనిట్లను ఉత్పత్తి చేయాలనేది తమ ప్రాథమిక ప్రణాళిక అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం అనుమతి ఇస్తే, 2023 నాటికి తొలి నమూనా (ప్రోటోటైప్) సెట్ తయారవుతుందని ఆయన వివరించారు. ‘ఎంఐ-17 స్థానంలో ప్రవేశపెట్టడానికి పది టన్నుల నుంచి 12టన్నుల వరకు బరువు కలిగిన హెలికాప్టర్‌ను ఉత్పత్తి చేయడంపై కేంద్రీకరించే ఒక భారీ ప్రాజెక్టును రూపొందించాం. దీనిని పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం జరుగుతుంది. సుమారు 500 హెలికాప్టర్లు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది.
ఈ ప్రాజెక్టు వల్ల రానున్న సంవత్సరాలలో త్రివిధ దళాల కోసం విదేశాల నుంచి రూ. 4లక్షల కోట్లకు పైగా విలువ కలిగిన హెలికాప్టర్ల దిగుమతిని నిలిపివేయవచ్చు’ అని మాధవన్ పేర్కొన్నారు. ఈ యుద్ధ హెలికాప్టర్‌కు డిజైన్ చేయడంతో పాటు నమూనా (ప్రోటోటైప్) హెలికాప్టర్‌ను ఉత్పత్తి చేయడానికి రూ. 9,600 కోట్లు అవసరం అవుతాయని ఆయన వివరించారు. ‘మాకు 2020లో అనుమతి లభిస్తే, 2027 నాటికి తొలి హెలికాప్టర్‌ను తయారు చేయగలుగుతాం. ఈ రకానికి చెందిన కనీసం 500 హెలికాప్టర్లను తయారు చేయాలని మేము చూస్తున్నాం. మేము పని చేస్తున్న వాటిలో ఒక భారీ ప్రాజెక్టుగా ఇది ఉంటుంది’ అని మాధవన్ తెలిపారు. తేజాస్ మిలిటరి ఎయిర్‌క్రాఫ్ట్ అభివృద్ధి తరువాత హెచ్‌ఏఎల్ చేపడుతున్న అత్యంత పెద్ద ప్రాజెక్టు ఇదని ఒక మిలిటరి నిపుణుడు పేర్కొన్నారు.