బిజినెస్

ఆర్టీసీకి ‘వ్యాట్’ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 1: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పటికే దాదాపు 5వేల కోట్ల రూపాయల మేర పీకల్లోతు నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీపై అదనపు భారం పడింది. ఇటీవలే నామమాత్రంగా టిక్కెట్ చార్జీ పెంచినప్పటికీ పెరిగే వడ్డీల భారంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.07 పైసలు వ్యాట్ చార్జీ పెంచింది. రాష్ట్రంలో అత్యధికంగా డీజిల్ వినియోగంలో మొదటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల బస్సులు ఉండగా నెలకు సగటున 30కోట్ల లీటర్ల డీజిల్‌ని వినియోగిస్తున్నాయి. తాజాగా లీటర్‌కు రూ. 1.07 పైసలు పెరిగిందంటే నెలకు రూ. 32కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ. 400 కోట్లు అదనపు భారం పడినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం 2రూపాయలు అదనంగా అంటే 22.25 శాతంపై రూ. 24.25 పైసలు మేర వ్యాట్ వసూలు చేయటం ప్రారంభించింది. అలాగే పెట్రోలు లీటర్ 31శాతంపై రెండు రూపాయలు అదనంగా మొత్తం రూ.33 వ్యాట్ వసూలు చేయటం ఆరంభించింది. అయితే పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం ఏడాది క్రితమే ఒక్కసారిగా రెండు రూపాయలు తగ్గించడంతో వాహన యజమానులు సరిహద్దులోని తెలంగాణ పెట్రోలు బంక్‌లతో ఫుల్‌ట్యాంక్‌లు నింపుకోవటం ప్రారంభించారు. తాజాగా డీజిల్‌పై రూ. 1.07 పైసలు, పెట్రోల్‌పై 76 పైసలు వడ్డన జరిగింది. గతంలో డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేసేవి. అయితే ప్రభుత్వంలో విలీనం కావటం, పైగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ వర్తించడంతో ఏఒక్కరూ రోడ్డెక్కే వీలులేదు. దీంతో పెరిగిన డీజిల్ ధరపై ఆందోళన చేసేవారు కనిపించడం లేదు. ఇక కృష్ణాజిల్లానే అధికంగా ఆర్టీసీ బస్సులున్నాయి. జిల్లాలో 1432 బస్సులున్నాయి. ప్రతిరోజు ఈ బస్సులు ఐదు లక్షల కి.మీ చొప్పున నడుస్తాయి. పెరిగిన 1.07 పైసల వ్యాట్‌తో నెలకు కోటీ 60లక్షలు చొప్పున సాలీనా రూ. 19.21 కోట్ల మేర భారం పడనుంది. జిల్లాలో ఇతర వినియోగదారులందరిపై కలిసి రూ. 117కోట్ల మేర భారం పడింది. జిల్లావ్యాప్తంగా 250 పెట్రోలు, డీజిల్ బంకులున్నాయి. ప్రతి బంకులో సగటున రోజుకు 3వేల లీటర్ల పెట్రోలు, 8వేల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. పెరిగిన చార్జీలను మొత్తం 250 బంకులపై రోజుకు పెట్రోలు వినియోగదారులు రూ. 5.70 లక్షల లెక్కన నెలకు రూ. 1.71కోట్లు, ఏడాదికి రూ. 20.52 కోట్లు భారం పడుతుంది. అదే డీజిల్ వినియోగదానికి వస్తే సగటున బంకుల్లో రోజుకు 8వేల లీటర్ల వినియోగం జరుగుతుంది. దీనివల్ల రోజుకు రూ. 21.40 లక్షల చొప్పున నెలకు రూ. 6.42కోట్లు సాలీనా రూ. 77.10 కోట్ల భారం పడుతోంది.