బిజినెస్

జాతీయ స్థాయి సలహా సంస్థగా ఏపి ట్రాన్స్‌కో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీలో అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకు ఏపి ట్రాన్స్‌కో సేవలను జాతీయ స్ధాయిలో వినియోగించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ వివరాలను ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి తెలిపారు. జాతీయ స్ధాయిలో విద్యుత్ పంపిణీని పటిష్టం చేయడానికి ఏపి ట్రాన్స్‌కోను సలహాదారుగా కేంద్రం నియమించిందని ఆయన చెప్పారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో 2022 ఎడి నాటికి 1.75 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఏపి వాటాను పదిశాతంగా నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్రం గత రెండు సంవత్సరాల్లో మిగులు విద్యుత్‌ను సాధించినందుకు కేంద్రం ఈ గౌరవాన్ని ఆంధ్రాకు కల్పించిందన్నారు. దేశంలో వంద జిడబ్ల్యు సౌర విద్యుత్, హై కెపాసిటీ ఫ్రీ వీలింగ్ గ్రిడ్, అంతరాష్ట్ర విద్యుత్ పంపిణీ లైన్లు, విద్యుత్ ప్రణాళికల్లో ఏపి ట్రాన్స్‌కో సేవలను విస్తృతంగా వినియోగించుకుంటామని కేంద్రం తెలియచేసినట్లు ఆయన చెప్పారు.