బిజినెస్

స్వల్పంగా లాభపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం సెషన్‌లో ఆర్జించిన మంచి లాభాలను దేశంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా మదుపరులు ఆచితూచి వ్యవహరించడం తో తరువాత నిలబెట్టుకోలేక పోయాయి. దీంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 61.13 పాయింట్లు మాత్రమే లాభపడింది. గురువారం ఉదయం సెష న్ మొదలయినప్పటి నుంచే ప్రారంభమయిన ర్యాలీతో ఈ సూచీ ఇంట్రా-డేలో 478 పాయింట్లు పైకి ఎగబాకింది. అయితే సెషన్ ముగిసే సమయానికి క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 61.13 పాయింట్ల (0.16 శాతం) ఎగువన 38,470.61 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 18 పాయింట్ల (0.16 శాతం) ఎగువన 11,269 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా గురువారం నాటి లావాదేవీలలో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజి, హెచ్‌యూఎల్, టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. మూలధన వ్యయం కొరతతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న యెస్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో ముందుకు సాగడానికి ప్రభుత్వం ఎస్‌బీఐకి, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్ విలువ 1.05 శాతం పెరిగింది. సానుకూల ప్రపంచ సంకేతాల వ ల్ల గురువారం సెషన్‌లో లావాదేవీలు అధిక స్థాయి ల వద్ద జరిగినప్పటికీ, దేశంలో పెరుగుతున్న కరో నా వైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని మదుపరు లు రిస్క్‌ను తప్పించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు తొలుత ఆర్జించిన లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని వ్యాపారులు పేర్కొన్నారు. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం మరో కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 16మంది ఇటలీ పర్యాటకులతో కలుపుకొని 30కి పెరిగింది.
ప్రపంచంలోని వివిధ దేశాలు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకున్న చర్యల వల్ల ప్ర పంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని ఇనె్వస్టర్లు విశ్వాసంతో ఉండటం వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ వచ్చింది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆర్థికంగా చేయూత కోరుతున్న తక్కువ ఆదాయం కలిగిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు 50 బిలియన్ డాలర్ల మేరకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అంతర్జాతీ య ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) బుధవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా చైనా, షాంఘై, సియో ల్, టోక్యో స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. అయితే, యూరప్‌లో స్టాక్ మార్కెట్లు తొలి లావాదేవీలలో ఒక శాతం మేరకు నష్టపోయాయి. కాగా, బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర 0.04 శాతం పెరిగి, బారెల్‌కు 51.16 డాలర్లకు చేరుకుంది.