బిజినెస్

సుబ్రతా రాయ్‌కి మళ్లీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయ. తల్లి చనిపోవడంతో మానవతా కారణాలపై ఇటీవల సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరికి ఇటీవల మంజూరు చేసిన బెయిల్‌తో పాటు అన్ని రకాల తాత్కాలిక ఊరటలను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. అంతేకాకుండా వీరందరినీ మళ్లీ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్, జస్టిస్ ఎఆర్.దవే, జస్టిస్ ఎకె.సిక్రీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో సహారా గ్రూపు తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన వినిపిస్తూ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజి బోర్డు (సెబీ) నిర్వహిస్తున్న ఆస్తుల అమ్మకం ప్రక్రియలో తమకు భాగస్వామ్యం కల్పించలేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ‘గతంలో మీకు బెయిలుతో పాటు తాత్కాలిక ఊరటలన్నింటినీ రద్దు చేస్తున్నాం. మీ వాదన వినాలంటే ముందు మీరు జైలుకెళ్లండి. అంతేతప్ప ఈ వ్యవహారంలో ఏమి చేయాలో మాకు చెప్పొద్దు’ అని స్పష్టం చేసింది. అంతేకాకుండా సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరిని తక్షణమే కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించాలని అక్కడున్న అధికారులను ఆదేశించింది.