బిజినెస్

ఎస్ బ్యాంక్‌కు పునరుజ్జీవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌కు ఊతం ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంక్ పునర్ణిర్మాణ ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. రీకన్‌స్ట్రక్షన్ ముసాయిదాను బ్యాంక్ అధికారులు పరిశీలిస్తున్నారని, లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇస్తారని తెలిపారు. ఎస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాగా, 11,760 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎస్బీఐ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందులో 4,940 కోట్ల రూపాయలను బ్యాంక్‌కు ఇన్‌ఫ్యూజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని రజనీష్ కుమార్ పునరుద్ఘాటించారు. వాటాదారుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక పెట్టుబడులను ఎస్బీఐ ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇలావుంటే, ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ నివాసంతోపాటు అతనికి సంబంధించిన వారి ఇళ్లు, వ్యాపార సంస్థలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ బ్యాంక్ నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్‌ఫ్రా, సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ వంటి సంస్థలు భారీగా రుణాలు తీసుకొని, బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో నష్టాల ఊబిలోకి దిగబడిపోయింది. రాణా కపూర్ వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలే ప్రస్తుత దుస్థితికి కారణమన్న విమర్శలు ఉన్నాయి.